Im Game Collection: దుల్కర్ సల్మాన్‌కు గట్టి పోటీ ఇస్తున్న మమితా బైజు- ఐయామ్ గేమ్ కలెక్షన్స్ పతనం- 3 రోజుల్లో ఇంతే!
Im Game Box Office Collection Day 3: దుల్కర్ సల్మాన్‌కు హీరోయిన్ మమితా బైజు గట్టి బాక్సాఫీస్ పోటీ ఇస్తోంది. దుల్కర్ ఐయామ్ గేమ్ సినిమా 3వ రోజు కలెక్షన్స్ కంటే మమితా బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ 16వ రోజు వసూళ్లు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఐయామ్ గేమ్ 3 డేస్ కలెక్షన్స్ వివరాలపై లుక్కేద్దాం.
Im Game 3 Days Worldwide Box Office Collection: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరికొత్త క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 3) భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, వారాంతంలో ఊపందుకుంటుందని భావించినప్పటికీ మూడో రోజు వసూళ్లు కాస్త తగ్గడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది.

ఐయామ్ గేమ్ పతనం
శనివారం (సెప్టెంబర్ 5) కూడా వసూళ్లలో పతనం నమోదు కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఐయామ్ గేమ్ చిత్రం నిలదొక్కుకోవడానికి ఆదివారం (సెప్టెంబర్ 6) కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి.
తెలుగులో 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. అయితే మలయాళంలో మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఐయామ్ గేమ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథనంపై భిన్నాభిప్రాయాలు రావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ఆ ప్రభావం పడుతోంది.
మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
ప్రముఖ ట్రేడ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, శనివారం నాడు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 4.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం సాధించిన రూ. 4.90 కోట్లతో పోలిస్తే ఇది 15.3 శాతం తక్కువ.
మొదటి రోజు రూ. 5.40 కోట్లతో బోణి కొట్టిన 'ఐయామ్ గేమ్' సినిమా మూడు రోజులు పూర్తయ్యేసరికి భారత బాక్సాఫీస్ వద్ద రూ. 14.45 కోట్ల నెట్ (రూ. 16.90 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది.
ఐయామ్ గేమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 13.75 కోట్లు రాబట్టడంతో, ఈ సినిమా మూడ్రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ. 30.65 కోట్ల కలెక్షన్స్‌కు చేరుకుంది. 2023లో వచ్చిన దుల్కర్ మునుపటి మలయాళ చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త' మూడు రోజుల్లో సాధించిన రూ. 11.50 కోట్ల నెట్ (ప్రపంచవ్యాప్తంగా రూ. 25.18 కోట్ల గ్రాస్) లెక్కలను ఈ చిత్రం దాటేసింది.
తెలుగు, హిందీలో నిరాశాజనక స్పందన
భాషల వారీగా చూస్తే 'ఐయామ్ గేమ్' మలయాళ వెర్షన్‌కు మాత్రమే కొంత మేర ఆదరణ లభిస్తోంది. శనివారం ఒక్క రోజు మలయాళంలో రూ. 2.65 కోట్ల నెట్ వసూళ్లు రాగా, తెలుగులో రూ. 75 లక్షలు, తమిళంలో రూ. 70 లక్షలు, హిందీలో కేవలం రూ. 5 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. దేశవ్యాప్తంగా శనివారం ప్రదర్శించిన 3,014 షోలలో సగటున 34.4 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
దుల్కర్‌కు పోటీగా మమితా బైజు
అయితే, దుల్కర్ సల్మాన్ సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది ప్రేమలు బ్యూటీ మమితా బైజు మూవీ. అదే బెత్లెహెమ్ కుడుంబ యూనిట్. ఆగస్ట్ 21న విడుదలైన ఈ సినిమా ఇంకా వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 16వ రోజున కూడా ఈ సినిమా ఇండియాలో రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అంటే, ఐయామ్ గేమ్ కంటే రూ. 2.85 కోట్లు ఎక్కువ.
ఇప్పటికీ బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 238.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే, సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఐయామ్ గేమ్ సినిమాలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతీర్, వినయ్ ఫోర్ట్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


