Kayadu Lohar: ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేను, దానిపై నటి ఒక్కరే పోరాడాల్సి వస్తుంది.. హీరోయిన్ కయాదు లోహర్ కామెంట్స్
Kayadu Lohar About Women Objectification: సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ ప్రదర్శన, ఆట బొమ్మలుగా చూపించే ధోరణిపై బ్యూటిఫుల్ హీరోయిన్ కయాదు లోహర్ ఘాటుగా స్పందించారు. కేవలం అటెన్షన్, ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ కోసం హీరోయిన్లను వస్తువుగా మార్చే పాత్రలకు తాను అస్సలు ఒప్పుకోనని స్పష్టం చేశారు.
Kayadu Lohar About Women Objectification: తెలుగులో కూడా హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది బ్యూటిఫుల్ కయాదు లోహర్. రీసెంట్‌గా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది ఈ ఫంకీ భామ. ఇటీవల దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమాలో అలరించిన కయాదు లోహర్ నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

సంగీత దర్శకుడు హీరోగా
అయితే, తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' చిత్రం విడుదల తర్వాత హీరోయిన్ కయాదు లోహర్ ఇండస్ట్రీలోని ఒక సున్నితమైన అంశంపై నోరు విప్పారు.
గ్లామర్ బొమ్మలుగా చూపించడం
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో మహిళలను కేవలం ఆకర్షణీయమైన వస్తువుగా (Objectification) చూపించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చిత్రీకరించే తీరుపై కయాదు తన మనసులోను మాటను బయటపెట్టారు.
అలా చూపించడం నాకు నచ్చదు!
"కేవలం ఆకర్షణ కోసం నటీమణులను వస్తువుగా చూపించడం నాకు ఎప్పటికీ నచ్చదు. కథకు, పాత్రకు నిజంగా అవసరమైతే ఒక పరిమితి వరకు ఓకే. కానీ కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం మాత్రమే గ్లామర్ ప్రదర్శన చేయమంటే నేను కచ్చితంగా నో చెప్తాను" అని కాయదు లోహర్ తెగేసి చెప్పారు.
షూటింగ్ సెట్స్‌లో పోరాటం కష్టం!
తాత్కాలికంగా వచ్చే ఫేమ్ కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని కయాదు లోహర్ స్పష్టం చేశారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఇటువంటి సన్నివేశాలను వ్యతిరేకించడం ఎంత కష్టమో కూడా కయాదు లోహర్ వివరించారు.
ఒక్కరమే పోరాడాల్సి వస్తుంది
"ఇలాంటి సీన్ల గురించి దర్శకులు లేదా మేకర్స్‌తో మాట్లాడటం చాలా కష్టమైన విషయం. సెట్‌లో మిగతా వాళ్లంతా ఇది మామూలే కదా అని సమర్థిస్తుంటే.. ఒక్కరమే (హీరోయిన్స్) దానిపై పోరాడాల్సి వస్తుంది. కానీ, మన సిద్ధాంతానికి కట్టుబడి ఉండక తప్పదు. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. కథకు సంబంధం లేని గ్లామర్ సీన్లను వీక్షకులు తిరస్కరిస్తున్నారు" అని కయాదు లోహర్ పేర్కొన్నారు.
'పెద్ది' వివాదాన్ని గుర్తుచేసిన కయాదు?
కయాదు లోహర్ ఏ సినిమా పేరు సూటిగా చెప్పకపోయినప్పటికీ, ఇటీవల రామ్ చరణ్ - బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమా వివాదాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
పెద్ది సినిమా గురించేనంటూ
ప్రేక్షకులలో వచ్చిన వ్యతిరేకత కారణంగా మేకర్స్ ఆ సన్నివేశాలను విడుదలైన రెండు వారాల తర్వాత సినిమా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కయాదు చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఈ ఘటనను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కయాదు లోహర్ సినిమాలు
ఇటీవల దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్', అలాగే విశ్వక్ సేన్ 'ఫంకీ' వంటి చిత్రాలతో అలరించిన ముద్దుగుమ్మ కయాదు లోహర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సూర్య 48వ ప్రాజెక్ట్‌తో పాటు 'ది ప్యారడైజ్', 'తారమ్', 'మంజనాత్తి' వంటి క్రేజీ చిత్రాలలో కయాదు లోహర్ కీలక పాత్రలు పోషిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


