Jayaho Janardhana: జయహో జనార్ధన నుంచి మాస్ సాంగ్ రిలీజ్- బుచ్చిబాబు చేతుల మీదుగా విడుదల- ప్యారడైజ్ ఆయా షేర్ సింగర్‌తో!
Buchi Babu Released Jayaho Janardhana First Song: పాన్ ఇండియా దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా 'జయహో జనార్ధన' చిత్రం నుంచి 'చిందువేయవే చాందుక తుకడ' పాట విడుదలైంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ హై ఎనర్జిటిక్ మాస్ ట్రాక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
Buchi Babu Released Jayaho Janardhana First Song: పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జయహో జనార్ధన'. ఈ సినిమాలో నరేష్ వాసం, రమ్యశ్రీ జంటగా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్, కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జయహో జనార్ధన సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పెద్ది చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో
తాజాగా జయహో జనార్ధన సినిమా నుంచి తొలి లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఈ 'చిందువేయవే చాందుక తుకడ' అనే పాటను లాంచ్ చేశారు.
చిందువేయవే చాందుక తుకడ సాంగ్ లాంచ్ తర్వాత
జయహో జనార్ధన 'చిందువేయవే చాందుక తుకడ' సాంగ్ లాంచ్ అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. అయితే, 'చిందువేయవే చాందుక తుకడ' సాంగ్ వినిపించగానే నోట పలికేలా ఉన్న ఈ హై ఎనర్జిటిక్ పాటకు నేషనల్ అవార్డు గ్రహీత, సీనియర్ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.
ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్ తరహాలో
చరణ్ అర్జున్ బాణీలు కట్టిన ఈ మాస్ నంబర్‌ను నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో సూపర్ హిట్ అయిన ఆయా షేర్ పాట తరహాలోనే జంగి రెడ్డి ఆలపించారు. ఫిమేల్ వాయిస్‌ను మోహనా భోగరాజు అందించారు. పాటలోని బీట్, లిరిక్స్ వినోదాత్మకంగా ఉంటూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పూర్తిస్థాయి వినోదాత్మకంగా
తెలుగు తెరపై కామెడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని జయహో జనార్ధన చిత్రాన్ని పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, అప్పారావు, రాజమౌళి, పటాస్ ప్రవీణ్ తదితర ప్రముఖ హాస్య నటులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.
డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా
ఇటీవలె జయహో జనార్ధన చిత్ర పోస్టర్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత పానుగంటి శరత్ రెడ్డి మాట్లాడుతూ.. కథకు తగ్గట్టుగానే ప్రతీ సాంకేతిక నిపుణుడు ఎంతో నిష్ణాతులతో పనిచేస్తున్నారని తెలిపారు.
త్వరలో జయహో జనార్ధన రిలీజ్ డేట్ ప్రకటన
నందమూరి హరి ఎడిటింగ్, విజయ్ ఠాగూర్ కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్ పానుగంటి శరత్ రెడ్డి. త్వరలోనే సినిమాకి సంబంధించిన జయహో జనార్ధన టీజర్, ట్రైలర్లతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'జయహో జనార్ధన' సినిమా నుంచి మొదటి పాటను ఎవరు విడుదల చేశారు?
'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా 'చిందువేయవే చాందుక తుకడ' పాట విడుదలైంది.
2. 'చిందువేయవే చాందుక తుకడ' పాటకు సంగీతం, సాహిత్యం ఎవరు అందించారు?
ఈ పాటకు చరణ్ అర్జున్ సంగీతం అందించగా, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చారు.
3. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?
నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. 30 ఇయర్స్ పృథ్వీ, చలాకి చంటి, జబర్దస్త్ రాఘవ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


