Peddi New Scenes Added: పెద్దిలో జాన్వీ సీన్లపై బుచ్చిబాబు సంచలన నిర్ణయం-థియేటర్లలో కొత్త ట్విస్ట్-డైరెక్టర్ మైండ్ గేమ్!
Peddi New Scenes Added: పెద్ది మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న ట్రోలింగ్ కు చెక్ పెట్టేలా అదిరే ప్లాన్ రెడీ చేశారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కొత్త సీన్లను యాడ్ చేయనున్నారు. ఈ సీన్లు ఎప్పటి నుంచి సినిమాలో కనిపిస్తాయనే విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు వెల్లడించాడు.
Peddi New Scenes Added: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద రూ. 378 కోట్ల కలెక్షన్లతో ఊచకోత కోస్తోంది. అయితే, ఈ భారీ సక్సెస్ మధ్యే హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ చర్చలకు చెక్ పెట్టేందుకు దర్శకుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.

జాన్వీ కపూర్ కొత్త సీన్లు
పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ను కేవలం ఓ శృంగార వస్తువుగా చూపించారనే ట్రోల్స్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్లను మూవీ నుంచి డిలీట్ చేశారు. ఇప్పుడేమో జాన్వీ కపూర్ ను ఎలివేట్ చేసేలా పెద్ది సినిమాలో కొత్త సీన్లు యాడ్ చేయబోతున్నారు.
రెండు సీన్లు
పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కు చెందిన రెండు సీన్లు యాడ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఆదివారం (జూన్ 14) ప్రకటించాడు. ఎడిటింగ్‌లో కట్ చేసిన రెండు బలమైన ఎమోషనల్ సీన్లను ఈ బుధవారం (జూన్ 17) నుంచి థియేటర్ ప్రింట్లకు యాడ్ చేయబోతున్నట్లు తెలిపాడు.
బుచ్చిబాబు ‘క్యారెక్టర్ ఆర్క్’ మాస్టర్ ప్లాన్!
బాక్సాఫీస్ వద్ద పది రోజుల్లోనే రూ.378 కోట్లు వసూలు చేసిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు, రన్నింగ్ థియేట్రికల్ ప్రింట్లలో కొత్త సీన్లు యాడ్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఒకవైపు సినిమాకు డ్యామేజ్ కంట్రోల్ పీఆర్ గా ఉపయోగపడుతూనే, మరోవైపు రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అద్భుతమైన కమర్షియల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు.
‘అచ్చియమ్మ’ వివాదం
పెద్ది సినిమా విడుదలైన తొలి రోజు నుంచే 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడిచింది. హీరో మొరటుతనాన్ని ఎలివేట్ చేసే క్రమంలో హీరోయిన్‌పై చిత్రీకరించిన కొన్ని క్లోజప్ షాట్లు, కెమెరా యాంగిల్స్ ఆమెను కేవలం ఆబ్జెక్టిఫై (Objectify) చేసినట్లు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.
దీనిపై దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే క్షమాపణలు చెప్పి కొన్ని షాట్లను ట్రిమ్ చేసినప్పటికీ, ఆడియన్స్‌లో ఉన్న అసంతృప్తి పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు హీరోయిన్ పాత్రకు కథలో లోతు, ప్రాధాన్యతను పెంచే రెండు కీలక ఎమోషనల్ సీన్లను తిరిగి జోడించడం ద్వారా, ఆ విమర్శల నోళ్లు మూయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కలెక్షన్లు పెంచేలా
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం 'పెద్ది' చిత్రం ఇప్పటికే ఆంధ్రా, నైజాం బయ్యర్లను ప్రాఫిట్ జోన్‌లోకి తెచ్చింది. రాబోయే వారంలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో, ఈ ‘న్యూ సీన్స్ అడిషన్’ ప్లాన్ సినిమాకు మరింత ప్లస్ కానుంది.
రూ. 500 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేసిన 'పెద్ది' మేకర్స్.. ఈ బుధవారం నుంచి కొత్త సీన్లు వస్తున్నాయనే బజ్‌ను క్రియేట్ చేశారు. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సీన్లు ఎలా ఉంటాయో చూడాలనే కుతూహలం మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలోనూ కలుగుతుంది. ఇది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉన్న వీక్‌డేస్ కలెక్షన్ల గ్రాఫ్‌ను మళ్లీ పైకి లేపే పక్కా బిజినెస్ మైండ్ గేమ్ అని చెప్పొచ్చు.
People Also Ask (PAA) - తరచుగా అడిగే ప్రశ్నలు
- పెద్ది మూవీలో జాన్వీ కపూర్ కొత్త సీన్లు ఎప్పటి నుంచి చూడవచ్చు?
జవాబు: దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారిక ప్రకటన ప్రకారం.. ఎడిటింగ్‌లో తొలగించిన రెండు కీలక సన్నివేశాలను ఈ బుధవారం నుంచి థియేటర్లలో ప్రదర్శించే అన్ని ప్రింట్లకు జోడించనున్నారు.
2. పెద్ది సినిమా హిట్ ఆ ఫ్లాపా?
జవాబు: 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 378 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్‌గా దూసుకుపోతోంది.
3. జాన్వీ కపూర్ పాత్రపై ఎలాంటి విమర్శలు వచ్చాయి?
జవాబు: సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ సీన్లు, కెమెరా యాంగిల్స్ కేవలం గ్లామర్ కోణంలోనే ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


