Peddi: యాంకర్ సుమ అడగ్గానే పెద్ది రిలీజ్ డేట్ చెప్పేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. రామ్ చరణ్ మూవీ వచ్చేది ఆ రోజే
Peddi: పెద్ది రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఎప్పుడు థియేటర్లకు వస్తుందో డైరెక్టర్ బుచ్చిబాబు సాన చెప్పేశాడు. ధనుష్ సినిమా ‘కర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ అడగ్గానే బుచ్చిబాబు పెద్ది విడుదల గురించి చెప్పేశాడు.
Peddi: థియేటర్లో పెద్దిగా రామ్ చరణ్ విధ్వంసానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ తాజా రిలీజ్ డేట్ పై బిగ్ అప్ డేట్ వచ్చేసింది. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ కొత్త డేట్ ను ప్రకటించారు. ధనుష్ సినిమా ‘కర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు ఈ ప్రకటన చేశాడు.

పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్ హీరోగా వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీని బుచ్చిబాబు సాన ప్రకటించాడు. ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. యాంకర్ సుమ అడగ్గానే పెద్ది రిలీజ్ డేట్ చెప్పేశాడు. జూన్ 25న ఈ సినిమా థియేటర్లకు వస్తుందన్నాడు.
పెద్ది షూటింగ్ నుంచే
‘కర’ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయిన బుచ్చిబాబు మాట్లాడుతూ పెద్ది షూటింగ్ అప్ డేట్ పంచుకున్నాడు. ‘‘పెద్ది షూటింగ్ నుంచే వచ్చా. ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ధనుష్ కు నేను పెద్ద ఫ్యాన్. మిమ్మల్ని చూడటానికి వచ్చా. ఉప్పెన టైమ్ లో వైష్ణవ్, నేను మీ సినిమాలు చూసేవాళ్లం. ‘రాంఝానా’, ‘ఆడు కాలం’ సినిమాలంటే చాలా ఇష్టం. మీ కోసం పరుగెత్తుకుని వచ్చా సార్. మీ డెడికేషన్ గురించి రెహమాన్ సార్ చాలా సార్లు చెప్పారు’’ అని బుచ్చిబాబు పేర్కొన్నాడు.
ఎప్పుడంటే?
కర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన బుచ్చిబాబు పెద్ది మూవీ జూన్ లో వస్తుందని అనడంతో అందరూ కేకలు పెట్టారు. డేట్ కూడా చెప్పండని సుమ అడగ్గానే.. జూన్ 25 అని బుచ్చిబాబు రివీల్ చేశాడు. ముందు నుంచి వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ పెద్ది జూన్ 25న రావడం ఖాయమైందని బుచ్చిబాబు ప్రకటనతో స్పష్టమైంది.
ఐటెం సాంగ్
పెద్ది సినిమా షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. ఇప్పుడు ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో శ్రుతి హాసన్ ఆడిపాడుతుందని తెలిసింది. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
రెండు సార్లు
పెద్ది మూవీ రిలీజ్ రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 30కు పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత జూన్ కు మార్చారు. ఇప్పుడు జూన్ 25న పెద్ది రాబోతుందని బుచ్చిబాబు చెప్పేశాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


