PEDDI Release Date: పెద్ది మూవీ రిలీజ్‌పై బిగ్ బజ్.. రామ్ చరణ్ వచ్చేది ఈ డేట్‌కేనా? త్వరలోనే అనౌన్స్‌మెంట్
PEDDI Release Date: పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం విడుదలను జూన్ కు వాయిదా వేసిన మేకర్స్ డేట్ మాత్రం ప్రకటించలేదు. దీంతో పెద్ది రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ తేదీకి సంబంధించిన బజ్ వైరల్ గా మారింది.
PEDDI Release Date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడు. అయితే మూవీ రిలీజ్ ను మాత్రం సస్పెన్స్ లో పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ను ఫుల్ డిసప్పాయింట్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ది రిలీజ్ డేట్ పై ఓ బజ్ వైరల్ గా మారింది.

పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబినేషన్లో రెడీ అవుతున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై ఓ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా జూన్ 25, 2026న రిలీజ్ కాబోతుందన్నది లేటెస్ట్ సమాచారం. ఇదే తేదీన పెద్దిగా రామ్ చరణ్ థియేటర్లకు రాబోతున్నాడనేది తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాను ఈ విషయం ఇప్పుడు ఊపేస్తోంది.
పోస్ట్ పోన్
నిజానికి పెద్ది మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. మార్చి 27న ఈ మూవీని విడుదల చేస్తామని ఫస్ట్ మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడేమో మరోసారి రిలీజ్ పోస్ట్ పోన్ చేసి, జూన్ లో సినిమాను థియేటర్లకు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే జూన్ 25, 2026 (గురువారం) పెద్ది రిలీజ్ అవుతుందనే ప్రచారం జోరందుకుంది.
అఫీషియల్ అనౌన్స్ మెంట్
అయితే పెద్ది రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేసే అవకాశముందని తెలిసింది. పెద్ది మూవీని జూన్ 25నే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ డిసైడ్ అయిందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
స్పెషల్ సాంగ్
పెద్ది మూవీ షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. ఇప్పుడు స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి శ్రుతి హాసన్ ఆడిపాడుతున్నట్లు తెలిసింది. ఈ సాంగ్ తోనే పెద్ది షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్.
స్పోర్ట్స్ డ్రామా
పెద్ది మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో క్రికెటర్ గానే కాకుండా మల్ల యోధుడిగానూ చెర్రీ కనిపించనున్నాడు. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ మూవీపై హైప్ పెంచేశాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


