VenkyAnil5: రావిపూడి రక్తంతో విజయ తిలకం.. అనిల్ తో ఆడుకున్న హీరోహీరోయిన్లు.. స్టోరీ ట్విస్ట్ రివీల్ చేసిన డైరెక్టర్
VenkyAnil5: సినిమా అంటే చాలు ప్రమోషన్లలను డిఫరెంట్ గా ప్లాన్ చేసే డైరెక్టర్ అనిల్ రావిపూడితో హీరోహీరోయిన్లు ఓ ఆటాడుకున్నారు. కత్తి లాంటి ఐడియా అంటూ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దారు. అంతే కాకుండా వెంకటేష్- కళ్యాణ్ రామ్ మూవీ స్టోరీ ప్లాట్ కూడా రివీలైంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
VenkyAnil5: వెంకటేష్- కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీ సందడి అప్పుడే షురూ అయింది. రీసెంట్ గా ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ డిఫరెంట్ ప్రమోషనల్ వీడియో వదిలింది టీమ్. ఇందులో అనిల్ తో హీరో హీరోయిన్లు ఓ ఆటాడుకున్నారు.

వైరల్ వీడియో
ఆదివారం (జూన్ 21) అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మాట్లాడుతుంటారు. ఇసుకలో పాతేశారంటీ పాపమని వెంకటేష్ అంటాడు. పటాస్ టైమ్ లో అనిల్ బాగానే ఉన్నాడు, కానీ ‘నేను పాడతా’ అంటూ మీరే ఇలా చేశారని కళ్యాణ్ రామ్ కౌంటర్ ఇస్తాడు. అప్పుడే హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి భయంతో పరుగెత్తుకుంటూ వస్తారు.
రావిపూడి రక్తంతో
హీరోయిన్ల వెనుకాలే కత్తి పట్టుకుని అనిల్ రావిపూడి వస్తాడు. కత్తిలాంటి ఐడియాలతో ప్రమోషన్లు చేస్తున్నానని ఫ్యాన్స్ చేతిలో కత్తి పెట్టారని అనిల్ చెప్తాడు. ఎప్పుడూ నేనే ఐడియా ఇవ్వాలా, మీరు ఇవ్వండని అడుగుతాడు. అప్పుడే కత్తి లాంటి ఐడియా అంటూ అనిల్ రావిపూడి వేలిని కట్ చేసి రక్తంతో విజయ తిలకం దిద్దుతాడు వెంకీ. కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కూడా అలాగే చేస్తారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్
అప్పుడే వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీ స్టోరీ ప్లాట్ ను అనిల్ రావిపూడి వెల్లడిస్తాడు. ‘‘ఎంత రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కథ సాగితే మాత్రం రక్త పాతం ఉంటుందా? మనది ఫ్యామిలీ కామెడీ మూవీ’’ అని అనిల్ రావిపూడి చెప్తాడు. అంటే డైరెక్టర్ మాటలను బట్టి చూస్తే ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. మరి అనిల్ ఈ సారి ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో చూడాలి.
సంక్రాంతి రిలీజ్
VenkyAnil5, NKRAR2 వర్కింట్ టైటిళ్లతో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ సోమవారం (జూన్ 22) నుంచి స్టార్ట్ కానుందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ చిత్రం 2027 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న అయిదో మూవీ ఇది. అనిల్ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ కు రెండో సినిమా. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


