Kayadu Lohar: షాకిచ్చిన ప్యారడైజ్ బ్యూటీ.. సోషల్ మీడియాకు హీరోయిన్ కాయదు లోహర్ గుడ్‌బై.. కారణం ఇదేనా?

Kayadu Lohar: ప్యారడైజ్ బ్యూటీ కాయదు లోహర్ షాకిచ్చింది. ఈ హీరోయిన్ సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. మనసుకు ప్రశాంతత అవసరమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన సుదీర్ఘ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Published on: Jun 20, 2026, 20:10:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kayadu Lohar: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ హీరోయిన్ కాయదు లోహర్ బిగ్ షాకిచ్చింది. సడెన్ గా ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో కాయదు అదరగొడుతోంది. అయితే ఈ బ్యూటీ నిర్ణయం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

షాకిచ్చిన ప్యారడైజ్ బ్యూటీ.. సోషల్ మీడియాకు హీరోయిన్ కాయదు లోహర్ గుడ్‌బై (instagram)
షాకిచ్చిన ప్యారడైజ్ బ్యూటీ.. సోషల్ మీడియాకు హీరోయిన్ కాయదు లోహర్ గుడ్‌బై (instagram)

కాయదు లోహర్ సంచలన నిర్ణయం

పాన్ ఇండియా హీరోయిన్ కాయదు లోహర్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన నటనతో, గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ అకస్మాత్తుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. శనివారం (జూన్ 20) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది కాయదు.

పోస్ట్ లో ఏముందంటే?

"సోషల్ మీడియా నుంచి కొద్దిరోజుల పాటు ఒక చిన్న అడుగు వెనక్కి వేస్తున్నా. మనం మన శరీరానికి ఎలాంటి విశ్రాంతిని ఇస్తామో, కొన్నిసార్లు మన మనసుకు కూడా అలాంటి విశ్రాంతే అవసరమవుతుంది. గత కొంతకాలంగా నా దినచర్యను కాస్త స్లో చేసుకోవాలని, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి కాసేపు డిస్‌కనెక్ట్ అవ్వాలని బలంగా అనిపిస్తోంది.

స్క్రీన్ బయట ఉన్న నా నిజ జీవితానికి, నాకు నేను ఎక్కువ సమయం కేటాయించుకోవాలని అనుకుంటున్నా. కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. కానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్ డేట్ ఉంటే ఇదే అకౌంట్ నుంచి నా టీమ్ షేర్ చేస్తుంది’’ అని కాయదు లోహర్ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

'డిజిటల్ డిటాక్స్' వెనుక అసలు ట్విస్ట్

సాధారణంగా కెరీర్ లో ఎదుగుతున్న దశలో ఉన్న హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యాన్ బేస్‌ను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అలాంటిది కాయదు లోహర్ 'డిజిటల్ డిటాక్స్' (Digital Detox) కు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆమె బిజీ లైఫ్ కారణంగా తెలుస్తోంది.

ఏడు సినిమాలు

ఈ ఏడాది ఫంకీ మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన కాయదు ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆమె చేతిలో ఏకంగా 7 సినిమాలున్నాయి. ఇందులో మూడు మలయాళం, మూడు తమిళ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇక తెలుగులో నానితో కలిసి ‘ది ప్యారడైజ్’లో కాయదు నటిస్తోంది. ఈ షూటింగ్ బిజీతో ఉన్న కాయదు కాస్త రెస్ట్ కోసమే సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More