The Paradise: నాని ది ప్యారడైజ్ ఆలస్యం అంటూ వార్తలు.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్

The Paradise: నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ ఆలస్యం అవుతుందంటూ కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లపై మేకర్స్ చాలా స్ట్రాంగా రియాక్ట్ అయ్యారు. సీరియస్ వార్నింగ్ ఇస్తూ దీనిపై వివరణ ఇచ్చారు. అందులో ఏముందో చూడండి.

Published on: May 12, 2026, 21:02:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) చుట్టూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరిస్తున్నారంటూ (Reshoots) వస్తున్న వార్తలను మేకర్స్ తీవ్రంగా ఖండించారు.

The Paradise: నాని ది పారడైజ్ ఆలస్యం అంటూ వార్తలు.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్
The Paradise: నాని ది పారడైజ్ ఆలస్యం అంటూ వార్తలు.. సీరియస్ వార్నింగ్ ఇస్తూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్

పుకార్లకు తావులేదు.. అంతా ప్లాన్ ప్రకారమే

సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న వార్తలపై 'ది ప్యారడైజ్' అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. "గత కొద్దిరోజులుగా మా సినిమాపై వస్తున్న నిరాధారమైన పుకార్లను గమనిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచి అత్యంత స్పష్టతతో సాగుతోంది. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన షెడ్యూల్ కూడా అనుకున్న సమయానికే జరుగుతుంది" అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

ముఖ్యంగా రీషూట్లపై వస్తున్న వార్తలకు బదులిస్తూ.. "సినిమాలో ఒక్క సీన్ కూడా ఇప్పటివరకు రీషూట్ చేయలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి ప్లాన్ లేదు. అత్యంత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కేవలం అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇకపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం" అని హెచ్చరించారు.

ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్

నాని కెరీర్‌లోనే విభిన్నమైన లుక్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని జడలు వేసుకుని, ముక్కు పుడకతో ఒక మాస్ అవతారంలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్లమ్ ఏరియాలో నాని వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్

దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానితో పాటు రాఘవ్ జుయల్, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

నాని గతంలో 'సరిపోదా శనివారం' (2024), 'హిట్: ది థర్డ్ కేస్' (2025) చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ క్రమంలో 'ది ప్యారడైజ్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ది ప్యారడైజ్' సినిమా రీషూట్లు జరుగుతున్నాయా?

లేదు. చిత్ర బృందం ఈ వార్తలను ఖండిస్తూ, ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని స్పష్టం చేసింది.

2. ది ప్యారడైజ్ సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

'ది ప్యారడైజ్' చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

3. ది ప్యారడైజ్ సినిమాలో నాని రోల్ ఎలా ఉండబోతోంది?

సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో నాని ఒక మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్, ముఖ్యంగా జడలు, ముక్కు పుడక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More