Nani: నాని అన్న పని రాక్షసుడు.. ట్విటర్ లో నెగెటివ్ కామెంట్స్ చూస్తే బీపీ పెరిగిపోతుంది.. జిమ్ ట్రైనర్ వైరల్ కామెంట్లు

Nani: అష్టా చమ్మాలో రాాంబాబు నుంచి హిట్ 3లో అర్జున్ సర్కార్ వరకు సినిమా ఏదైనా, అందులోని క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో జడల్ తో మరోసారి అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో నాని డెడికేషన్ గురించి జిమ్ ట్రైనర్ కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: May 9, 2026, 14:10:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani: నాని.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇదో బ్రాండ్. ఓ టార్గెట్ పెట్టుకుని కష్టపడితే ఎంతటి స్థాయికైనా చేరొచ్చని చాటిన హీరో నాని. నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని తన సినిమాల కోసం పెట్టే డెడికేషన్, పడే కష్టం మామూలుగా ఉండదు. తాజాగా ప్యారడైజ్ కోసం నాని ఎంతలా కష్టపడుతున్నాడో అతని జిమ్ ట్రైనర్ విశ్వ భరత్ వెల్లడించాడు.

ప్యారడైజ్ పోస్టర్ లో నాని (x/NameisNani)
ప్యారడైజ్ పోస్టర్ లో నాని (x/NameisNani)

పని రాక్షసుడు

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో విశ్వ భరత్ పాల్గొన్నాడు. హిట్ 2 షూటింగ్ అప్పటి నుంచి నానితో పని చేయడం స్టార్ట్ చేశానని అతను చెప్పుకొచ్చాడు. ‘‘హిట్ 2 అప్పుడు స్టార్ట్ చేశాం. రెండేళ్లకు పైనే అవుతోంది. వర్క్ విషయానికి వస్తే ఆయన (నాని) పని రాక్షసుడు.

చాలా సార్లు ట్విటర్ లో ఆయనపై నెగెటివ్ కామెంట్లు చూసినప్పుడు నా బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే నేను ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటా. ఏం జరుగుతుందో నాకు తెలుసు’’ అని విశ్వ చెప్పుకొచ్చాడు.

షూటింగ్ లో

‘‘ఇప్పుడు ప్యారడైజ్ షూటింగ్ జరుగుతోంది. మార్నింగ్ 5 గంటలకు లేస్తారు. ఆరు గంటలకు సెట్లో ఉంటారు. సాయంత్రం 7 గంటల వరకూ షూటింగ్ జరుగుతోంది. రోప్స్ కట్టుకుని యాక్షన్ సీన్లు చేస్తున్నారు. అప్పటికే ఫుల్ గా అలిసిపోయి ఉంటారు. మనం నార్మల్ గా ఒక సెషన్ వర్క్ చేస్తేనే అలిసిపోతాం’’ అని విశ్వ తెలిపాడు.

మళ్లీ వర్కౌట్

‘‘కానీ ఆయన పొద్దున నుంచి సాయంత్రం వరకూ రోప్ లు కట్టుకుని వేలాడుతూ అలసిపోయినా వర్కౌట్ ఆపరు. సాయంత్రం నాకు ఆయన అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది. నాని అన్న 40 నిమిషాలు ఇంట్లో ఉంటారు. వర్కౌట్ చేస్తారని చెప్తారు. 45 మినిట్స్ లో వర్కౌట్ కంప్లీట్ చేసి, తినేసి పడుకుంటారు. ‘నా వల్ల కాదు విశ్వ, పడుకుంటా’ అని ఆయన తప్పించుకోవచ్చు. కానీ అలా చేయరు’’ అని విశ్వ చెప్పాడు.

వంద శాతం

‘‘అందుకే ఆయన సినిమాల రిజల్ట్ అలా ఉంటాయి. జెర్సీ టైమ్ లో ఆయన క్రికెట్ నేర్చుకున్నారు. నాని అన్నకు వీవీఎస్ లక్ష్మణ్ ఫోన్ చేసి ప్రొఫెషనల్ గానే ఆడావు. ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఎందుకు రాకూడదని అన్నారంటా. అప్పుడు అర్జున్ క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా చేయడం కోసం ఆయన వంద శాతం కష్టపడ్డారు. ఇప్పుడు జడల్ క్యారెక్టర్ కోసం అంతే కష్టపడుతున్నారు’’ అని విశ్వ పేర్కొన్నాాడు. విశ్వ మాటలను బట్టి నాని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More