Maa Inti Bangaram Manjusha: వైరల్ గా ‘మా ఇంటి బంగారం’ సమంత ఫ్రెండ్ కిరణ్మయి-ఇన్‌స్టాగ్రామ్ టు బిగ్ స్క్రీన్‌-ఆమె ఎవరు?

Maa Inti Bangaram Manjusha: ​సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమాలో ‘కిరణ్మయి’ పాత్రలో నటించిన మంజూష ముక్కవిల్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. డెబ్యూ మూవీతోనే వైబ్ క్రియేట్ చేసిన ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ తో ఎలా ఛాన్స్ వచ్చిందో చూద్దాం.

Published on: Jun 20, 2026, 15:22:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maa Inti Bangaram Manjusha: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత రూత్ ప్రభు (Samantha), దర్శకురాలు బి.వి.నందిని రెడ్డిల క్రేజీ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం' థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 'ఓ బేబీ' వంటి మైల్‌స్టోన్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా కావడంతో ఆడియన్స్‌లో భారీ క్రేజ్ ఉంది. అయితే ఈ మూవీలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ వైరల్ గా మారింది.

వైరల్ గా ‘మా ఇంటి బంగారం’ సమంత ఫ్రెండ్ కిరణ్మయి (instagram)
వైరల్ గా ‘మా ఇంటి బంగారం’ సమంత ఫ్రెండ్ కిరణ్మయి (instagram)

ఆమె ఎవరు?

మా ఇంటి బంగారం సినిమాలో సమంత ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒక ఎత్తైతే.. కథలో ఆమె పక్కన ఉంటూ థియేటర్లలో క్లీన్ హ్యూమర్ పండించిన ‘కిరణ్మయి’ పాత్ర మరో ఎత్తు. సమంతకు బెస్ట్ ఫ్రెండ్‌గా ఈ పాత్రలో నటించిన ఆమె పేరు మంజూష ముక్కవిల్లి (Manjusha Mukkavilli). తన తొలి సినిమాలోనే నేచురల్ యాక్టింగ్‌తో ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టు సిల్వర్ స్క్రీన్

మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సమంతతో కలిసి మంజూష చెప్పిన "లెట్స్ కమాన్" అనే సింగిల్ డైలాగ్ విపరీతంగా మీమ్ మెటీరియల్‌గా మారింది. ఇక థియేటర్లలో సమంతతో ఆమె కెమిస్ట్రీ, కాంబినేషన్‌లో వచ్చే సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా నవ్విస్తున్నాయి. దీంతో అసలు ఈ మంజూష ముక్కవిల్లి బ్యాక్‌గ్రౌండ్ ఏంటని నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

నిజానికి మంజూష ముక్కవిల్లి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పాపులర్. తెలుగు ఇండస్ట్రీ లెజెండరీ ఓల్డ్ యాక్ట్రసెస్ అయిన సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మల ఐకానిక్ హావభావాలు, వింటేజ్ రాయలసీమ-ఆంధ్రా యాస డైలాగ్ డెలివరీని అద్భుతంగా ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ వైరల్ అవుతున్నాయి. పాతతరం నటనను నేటి జనరేషన్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై పరిచయం చేయడం ద్వారా ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

రీల్ చూసి

మంజూషకు మా ఇంటి బంగారంర సినిమాలో క్రేజీ ఆఫర్ రావడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. డైరెక్టర్ నందిని రెడ్డికి పాతతరం నటి సూర్యకాంతం అంటే విపరీతమైన ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మంజూష చేసిన సూర్యకాంతం రీల్ నందిని రెడ్డి కంట పడింది. ఆమె యాక్టింగ్ టైమింగ్‌కు ఫిదా అయిపోయిన నందిని రెడ్డి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా మంజూష ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు మెసేజ్చేసి ఆడిషన్స్‌కు రమ్మని పిలిచిందని టాక్.

3 సార్లు ఆడిషన్స్!

సమంత లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించే పాత్ర కావడం, పైగా స్క్రీన్‌పై ఎక్కడా ఆర్టిఫిషియాలిటీ లేకుండా పక్కా లోకల్ ఫ్రెండ్ లా కనిపించాల్సి రావడంతో.. నందిని రెడ్డి మంజూషకు దాదాపు మూడు సార్లు కఠినమైన ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ చేశారని తెలిసింది. ఒకవేళ ఈ ప్లేస్‌లో రెగ్యులర్ కమర్షియల్ ఆర్టిస్ట్‌ను పెట్టి ఉంటే రొటీన్‌గా ఉండేదని, మంజూష లాంటి ఫ్రెష్ అండ్ టాలెంటెడ్ ఫేస్‌ను ఎంపిక చేయడం వల్లే ‘కిరణ్మయి’ పాత్రకు అంతటి ఆర్గానిక్ కనెక్టివిటీ వచ్చిందని మేకర్స్ నమ్ముతున్నారు.

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్

గతంలో థియేటర్ ఆర్టిస్టులు లేదా ముంబై మోడల్స్ చుట్టూ తిరిగే టాలీవుడ్ కాస్టింగ్ మేనేజర్లు.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ క్రియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వెనుక బలమైన బిజినెస్ & ప్రమోషన్ స్ట్రాటజీ ఉంది.

మంజూష ముక్కవిల్లి లాంటి ఇన్-బిల్ట్ ఆడియన్స్ బేస్ ఉన్న క్రియేటర్లను సినిమాల్లోకి తీసుకోవడం వల్ల ప్రొడక్షన్ హౌస్‌కు డిజిటల్ ప్రమోషన్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. సినిమా రిలీజ్ టైమ్‌లో సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ తన సొంత హ్యాండిల్స్ ద్వారా చేసే రీల్స్, షార్ట్స్ నేరుగా యూత్ లోకి వెళ్తాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More