Samantha Ruth Prabhu: సమంత మరో పేరు తెలుసా? చదువులో టాపర్.. ఆస్ట్రేలియా వెళ్లాల్సిన సామ్ టాలీవుడ్ క్వీన్ గా ఎలా మారింది?
Samantha Ruth Prabhu: మా ఇంటి బంగారం సినిమాతో థియేటర్లలో సందడి చేస్తోంది సమంత్ రూత్ ప్రభు. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేవలం గ్లామర్ క్వీన్ మాత్రమే కాదు.. చదువులో గోల్డ్ మెడలిస్ట్ రేంజ్ టాపర్. ఆమెకున్న మరో పేరు, సమంత గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇక్కడ చూద్దాం.
Samantha Ruth Prabhu: వెండితెరపై సమంత (Samantha Ruth Prabhu) స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె నటన కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే, నేడు సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలను శాసిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఒక పక్కా ప్లానింగ్, కఠినమైన గతం ఉన్నాయి. కేవలం అదృష్టంతోనే కాకుండా, తన కష్టంతో ఆమె 'సమంత' అనే ఒక గ్లోబల్ బ్రాండ్‌ను ఎలా క్రియేట్ చేసిందో ఇక్కడ చూద్దాం.

చదువులో టాపర్
మా ఇంటి బంగారం మూవీతో థియేటర్లలో అదరగొడుతోంది సమంత. ఈ సినిమా ఇవాళ (జూన్ 19) రిలీజైంది. ఇక సమంత చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. క్లాస్‌లో ఎప్పుడూ ఆమెదే పైచేయి. చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన సమంత, ఆ తర్వాత ప్రసిద్ధ స్టెల్లా మేరిస్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పట్టా అందుకుంది.
ఆస్ట్రేలియా వెళ్లాలని
భవిష్యత్తులో ఒక టాప్ అకౌంటెంట్ అవ్వాలని సమంత అనుకుంది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని ఆమె గట్టిగా ప్లాన్ చేసుకుంది. కానీ అప్పట్లో కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కల సాకారం కాలేదు.
పార్ట్ టైమ్ మోడలింగ్
సొంత ఖర్చుల కోసం, కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం కాలేజీ రోజుల్లోనే సమంత పార్ట్ టైమ్ మోడలింగ్ స్టార్ట్ చేసింది. నిజానికి ఆమెకు హీరోయిన్ అవ్వాలనే ఆలోచన కానీ, ముందస్తు ప్రణాళికలు కానీ ఏమాత్రం లేవు. కానీ కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సమంతకు ఉన్న ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఆ తర్వాత కాలంలో ఆమె తన కెరీర్, రెమ్యునరేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది.
టాలీవుడ్ ట్రేడ్ ఈక్వేషన్స్ ప్రకారం.. సమంత తన కామర్స్ బ్యాక్‌గ్రౌండ్‌ను కేవలం సినిమాలకే పరిమితం చేయలేదు. ప్రస్తుతం ఆమె పలు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, సొంత ప్రొడక్షన్ హౌస్‌ను కూడా రన్ చేస్తోంది. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు బిజినెస్ ఎలా చేయాలో తెలిసిన అతికొద్ది మంది సౌత్ నటీమణులలో సమంత ఒకరు.
సమంత మరో పేరు
సమంత చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి తెలుగు వ్యక్తి. తల్లి ఏమో మలయాళీ. సమంత పూర్తి పేరు సమంత రూత్ ప్రభు అయినప్పటికీ, ఇంట్లో వాళ్లంతా ఆమెను ఎంతో ఇష్టంగా ‘యశోద’ అని పిలుచుకుంటారు. ఈ భిన్నమైన సంస్కృతులు, భాషలు ఉన్న వాతావరణంలో పెరిగింది సామ్.
హెల్త్ జర్నీ
సమంత జపనీస్ వంటకాలు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అయితే, 2013 లో ఆమెకు డయాబెటిస్ ఉందని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత కాలంలో ఆమె మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ కండిషన్‌తోనూ పోరాడింది. ఈ ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, కఠినమైన ఫిట్‌నెస్ నియమాలను ఎంచుకుని హెల్త్ అండ్ వెల్‌నెస్ ఐకాన్‌గా మారింది.
సామాజిక సేవలో 'ప్రత్యుష సపోర్ట్'
ప్రసిద్ధ హాలీవుడ్ నటి, మానవతావాది ఆడ్రీ హెప్బర్న్అంటే సమంతకు ఎంతో ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే సమంత పేద మహిళలు, అనాథ చిన్నారులకు వైద్య సహాయం అందించడం కోసం ‘ప్రత్యుష సపోర్ట్’ అనే ఎన్జీవోను స్థాపించింది. తన సంపాదనలో పెద్ద మొత్తాన్ని ఈ ఎన్జీఓ ద్వారా ల్యుకేమియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే పిల్లల కార్పొరేట్ వైద్యం కోసం ఖర్చు చేస్తోంది సామ్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


