Bigg Boss 10: మామూలు ట్విస్ట్ కాదు.. బిగ్ బాస్ 10లోకి ఆ కాంట్రవర్సీ హీరోయిన్.. ఈ సీరియల్ భామ.. ఇక షేక్ అవాల్సిందే!
Bigg Boss 10: మరోసారి టీవీ ఆడియన్స్ కు థ్రిల్ అందించేందుకు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఈ సారి పదో సీజన్ కాబట్టి మరింత స్పెషల్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌజ్ లోకి తీసుకొచ్చే కంటెస్టెంట్ల విషయంలో ప్లాన్స్ మామూలుగా లేవని టాక్. అదేంటో చూసేయండి.
Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రాబోతోంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్ తో పది రెట్ల వినోదాన్ని పంచేందుకు ఈ రియాలిటీ షో సిద్ధమవుతోంది. ఈ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో రాగానే ఈ సారి కంటెస్టెంట్లుగా హౌజ్ లోకి వెళ్లే సెలబ్రిటీలు ఎవరనే చర్చ జోరందుకుంది. వీళ్లలో ఓ సీనియర్ హీరోయిన్, సీరియల్ భామ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెడుతుందని టాక్. తరచూ వివాదాల్లో ఉండే ఆమె ఈ సారి స్పెషల్ గా సాగే బిగ్ బాస్ సీజన్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై షో మేకర్స్ ఆమెను సంప్రదించారని టాక్.
వారానికి లక్ష
కస్తూరి శంకర్ ను ఎలాగైనా హౌజ్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన ఈ సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాలు, సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తోంది.
కస్తూరి కోసం వారానికి రూ.లక్ష రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలిసింది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సినిమా ‘అన్నమయ్య’లో కస్తూరి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసింది.
సీరియల్ భామ
మరోవైపు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రియాంక నల్కర్ ను కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు తీసుకొస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమాల నుంచి సీరియల్స్ కు మారిన ఈ బ్యూటీకి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగే ఉంది.
ఆ మూవీతో ఎంట్రీ
ప్రియాంక ఫస్ట్ సినిమాల్లో నటించింది. శర్వానంద్ హీరోగా నటించిన ‘అందరి బంధువయా’ అనే సినిమాలో క్యారెక్టర్ తో ప్రియాంక డెబ్యూ చేసింది. ఆ తర్వాత నా సామి రంగా, వెల్ కమ్ టు అమెరికా, కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి, వైఫ్ ఆఫ్ రామ్, కాంచన 3 మూవీస్ లో మెరిసింది.
టాప్ ప్లేస్ లో
తెలుగులో చాలా కాలం నుంచి ప్రియాంక టాప్ సీరియల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ భామ ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ సమీరాలు, లక్ష్మీ రావే మా ఇంటికి తదితర సీరియల్స్ చేసింది.
రీసెంట్ జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. గతంలో తమిళ బిగ్ బాస్ కోసం తనను అడిగితే కుదరలేదని చెప్పింది. తెలుగు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా వెళ్లలేకపోయానంది. ఈ సారి మాత్రం అడిగితే కచ్చితంగా బిగ్ బాస్ 10కు వెళ్తానని చెప్పింది. దీన్ని బట్టి ఈ సారి ఫస్ట్ కంటెస్టెంట్ మీరేనా అని వర్ష అడిగితే.. ప్రియాంక నవ్వేసింది. దీన్ని బట్టి ప్రియాంక ఈ సారి బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


