Trisha Post: విజ‌య్‌తో రిలేష‌న్‌షిప్ రూమ‌ర్లు..ప్రేమ లేక‌పోతే అర్థ‌మే లేదంటూ త్రిష పోస్ట్‌..ఫ్యాక్ట్ షేర్ చేసిన హీరోయిన్

Trisha Post: దళపతి విజయ్, త్రిషల మధ్య అఫైర్ నడుస్తోందన్న ఊహాగానాల మధ్య త్రిష సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించిన తీరు ఆసక్తి కలిగిస్తోంది.

Published on: Apr 6, 2026, 10:09:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ రూమర్స్ ఇలా కొనసాగుతుండగానే, త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రేమ, మనశ్శాంతి, ఆత్మగౌరవం గురించి షేర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

విజయ్, త్రిష
విజయ్, త్రిష

త్రిష పోస్ట్

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియో, ఒక కొటేషన్‌ను షేర్ చేసింది. అందులో ముఖ్యంగా మనశ్శాంతి గురించి పేర్కొంది. "నేను ఇప్పుడు జీవితంలో ఒక కొత్త దశలో ఉన్నాను. ఇక్కడ ఎవరితోనూ వాదించే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ మీరు ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెబితే, మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటాను.

అది నేను మీతో ఏకీభవించడం కాదు, మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. సరిగ్గా ఉండటం కంటే ప్రశాంతంగా ఉండటమే నాకు ముఖ్యం" అని ఆ వీడియోలో ఉంది

ప్రేమ లేకపోతే

ప్రతి విషయానికి వివరణ ఇవ్వడం కంటే మౌనంగా ఉండటమే మేలని, ప్రతి ఒక్కరికీ మన శక్తిని కేటాయించాల్సిన అవసరం లేదని త్రిష పేర్కొంది. మరో స్టోరీలో.. "ప్రేమే సర్వస్వం కాకపోవచ్చు, కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు’’ అనే కోట్‌ను షేర్ చేసి దానికి 'Fact' (నిజం) అని క్యాప్షన్ ఇచ్చారు. దళపతి విజయ్‌తో రిలేషన్ గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ప్రేమ గురించి ఇలా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

త్రిష ఇన్ స్టాగ్రామ్ స్టోరీ
త్రిష ఇన్ స్టాగ్రామ్ స్టోరీ

విజయ్ విడాకుల వ్యవహారం వెనుక త్రిష?

విజయ్ నుంచి విడాకులు కావాలంటూ భార్య సంగీత సోర్నలింగం కోర్టు మెట్లు ఎక్కడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త ఓ సహనటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీనివల్ల తమ వైవాహిక జీవితం దెబ్బతిన్నదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.

అయితే సంగీత ఆరోపించిన ఆ హీరోయిన్ త్రిష అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఆరోపణలపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా నోరు మెదపలేదు.

పెళ్లి వేడుకలో కలిసి

ఇటీవల చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో విజయ్, త్రిష జంటగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ కలిసి స్టేజ్ పైకి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

గతంలో 'గిల్లి', 'కురువి', 'తిరుపాచి' వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ జంట, ఇటీవల 'లియో' సినిమాలోనూ కలిసి నటించారు. అలాగే విజయ్ నటించిన 'ది గోట్' సినిమాలో త్రిష గెస్ట్ రోల్ లో కనిపించి కనువిందు చేశారు.

త్రిష వరుస ప్రాజెక్టులు

ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో సూర్య సరసన 'కరుప్పు' అనే యాక్షన్ డ్రామాలో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంద్రాన్స్, నటరాజ్ సుబ్రహ్మణ్యం, యోగి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: విజయ్, త్రిష నిజంగానే ప్రేమలో ఉన్నారా?

వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ, దీనిపై విజయ్ లేదా త్రిష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రశ్న: విజయ్ భార్య సంగీత విడాకులు తీసుకున్నారా?

సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ప్రశ్న: త్రిష తాజా పోస్ట్ ఉద్దేశం ఏమిటి?

తనపై వస్తున్న వార్తల పట్ల తాను చలించడం లేదని, అనవసర వాదనల కంటే మనశ్శాంతే ముఖ్యం అని త్రిష ఆ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More