Vijay Wife Sangeetha: విజయ్ ఇంట్లో ఉండనివ్వడం లేదు.. బెదిరిస్తున్నాడు.. కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Vijay Wife Sangeetha: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ భార్య సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. త్రిష, విజయ్ సంబంధం నేపథ్యంలో సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడం వైరల్ గా మారింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ భార్య సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. విజయ్ తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని సంగీత ఆరోపించింది. విడాకుల పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకూ అదే ఇంట్లో ఉండేలా అనుమతి ఇప్పించాలని కోర్టును కోరింది. తాజాగా విజయ్, త్రిష సంబంధం నేపథ్యంలో సంగీత మరో పిటిషన్ వైరల్ గా మారింది.

విజయ్ భార్య సంగీత పిటిషన్
విజయ్ భార్య సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించింది. తన విడాకుల పిటిషన్ పై కోర్టు కేసులో తీర్పు వచ్చేంతవరకు విజయ్ ఇంట్లో ఉండేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది.
విజయ్ బెదిరింపులు
కోర్టులో సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. లండన్ కు చెందిన తనకు వేరే ఎక్కడా ఉండటానికి అనుమతి లేదని సంగీత పేర్కొంది. అందుకే విజయ్ కు చెందిన నీలాంగరై ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని సంగీత కోర్టును కోరింది. ఇంట్లో ఉంటానని అడిగితే తన లాయర్ తో విజయ్ బెదిరింపులకు పాల్పడ్డాడని సంగీత సంచలన ఆరోపణలు చేసింది.
అంతే కాకుండా విజయ్ ఆస్తిలో తనకు, తన పిల్లలకు న్యాయంగా రావాల్సిన వాటాను అందించాలని సంగీత కోర్టును కోరింది. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి విజయ్ ఒప్పుకోవడం లేదని ఆమె పేర్కొంది. రోడ్డున పడకుండా చూడాలని కోర్టును రిక్వెస్ట్ చేసింది.
విడాకుల పిటిషన్
ఇటీవల విజయ్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని సంగీత ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించింది. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష కలిసి ఒక ఈవెంట్లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. త్రిషతోనే విజయ్ కు సంబంధం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఫ్రెండ్ కావొచ్చని
విజయ్, త్రిష సంబంధంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే విజయ్ కు త్రిష ఫ్రెండ్ కావొచ్చని విజయ్ స్నేహితుడు, యాక్టర్ శ్రీమాన్ పోస్టు పెట్టడం వైరల్ గా మారింది. మరోవైపు తన భార్యకు భరణంగా రూ.250 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఒప్పుకొన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై విజయ్ లేదా సంగీత స్పందించలేదు. మరి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


