Vijay Trisha: పుకార్లను పక్కన పెట్టే టైమ్ వచ్చిందంటూ విజయ్ బాడీగార్డ్ పోస్ట్.. త్రిషతో రొమాన్స్ కన్ఫమ్ చేసినట్లేనా?

విజయ్, త్రిష (Vijay Trisha) కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయిన నేపథ్యంలో అతని బాడీగార్డ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వాళ్ల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ కన్ఫమ్ చేసేలా పుకార్లకు ఇక చెక్ పెట్టాలన్నట్లు అతడు ఓ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.

Mar 6, 2026, 13:58:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక వివాహ వేడుకకు హాజరుకావడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా రావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

Vijay Trisha: పుకార్లను పక్కన పెట్టే టైమ్ వచ్చిదంటూ విజయ్ బాడీగార్డ్ పోస్ట్.. త్రిషతో రొమాన్స్ కన్ఫమ్ చేసినట్లేనా?
Vijay Trisha: పుకార్లను పక్కన పెట్టే టైమ్ వచ్చిదంటూ విజయ్ బాడీగార్డ్ పోస్ట్.. త్రిషతో రొమాన్స్ కన్ఫమ్ చేసినట్లేనా?

బాడీగార్డ్ పోస్ట్.. డిలీట్.. ఆపై నెటిజన్ల చర్చ

వీరిద్దరూ బహిరంగంగా కనిపించడానికి కొన్ని గంటల ముందే విజయ్ బాడీగార్డ్ అరుణ్ సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "అన్ని పుకార్లకు అతీతంగా ఎదిగే సమయం వచ్చింది" అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు దీని స్క్రీన్ షాట్లు తీయడం మొదలుపెట్టగానే అతడు ఆ పోస్ట్‌ను తొలగించాడు.

కానీ విజయ్ 'హార్ట్' సింబల్ చూపిస్తున్న మరో ఫోటోను మాత్రం ఉంచాడు. విశేషం ఏమిటంటే, ఆ ఫోటోకు 2004లో విజయ్-త్రిష కాంబినేషన్‌లో వచ్చిన 'గిల్లి' సినిమాలోని 'కొక్కరకో' సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో జత చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌ను బాడీగార్డే పరోక్షంగా కన్ఫర్మ్ చేశారని ఎక్స్, రెడిట్ వేదికల్లో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

విడాకుల పిటిషన్‌లో సంగీత సంచలన ఆరోపణలు

విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెన్నై కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ గత వారమే లీక్ అయ్యింది. అందులో ఆమె విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తమ వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిందని పేర్కొన్నారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

2021 నుంచి విజయ్ కుటుంబానికి మానసికంగా దూరంగా ఉంటున్నారని, మాటలతో వేధించడమే కాకుండా, ఒకే ఇంట్లో ఉంటూనే తనను ఒంటరిని చేశారని సంగీత ఆరోపించారు. 2024 ఆగస్టు నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే తాను కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. విజయ్ ప్రవర్తన వల్ల తన పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

25 ఏళ్ల బంధానికి బీటలు

విజయ్, సంగీతలకు 1998లో బ్రిటన్‌లో వివాహం జరగ్గా, 1999లో చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుక నిర్వహించారు. పాతికేళ్ల వీరి వైవాహిక బంధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వీరి కుమారుడు జేసన్ సంజయ్ ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More