Trisha: ఇదేం ట్విస్ట్.. విజయ్ తో బంధం వ్యాఖ్యలపై పార్థిబన్ పై ఫైర్.. అతని కూతురితో మాత్రం ఫొటోలు.. త్రిష రూటే సెపరేట్!
Trisha: విజయ్ తో రిలేషన్ షిప్ పుకార్లు, పార్థిబన్ తో వివాదం నేపథ్యంలో త్రిష ట్విస్ట్ ఇచ్చింది. ఓ పెళ్లిలో పార్థిబన్ కూతురితో కలిసి త్రిష ఫొటోలు దిగింది. వీటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
దళపతి విజయ్ తో రిలేషన్ షిప్ పుకార్లు, పార్థిబన్ తో వివాదంలో హీరోయిన్ త్రిష ట్విస్ట్ ఇచ్చింది. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని పార్థిబన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన త్రిష.. తాజాగా అతని కూతురితో కలిసి ఫొటోలు దిగింది. స్టైలిస్ట్ ఏకా లఖానీ, రవి భగచంద్‌కా వివాహంలో ఇది చోటు చేసుకుంది.

పార్థిబన్ కూతురితో త్రిష
ఏకా లఖానీ, రవి భగచంద్‌కా పెళ్లిలో తను తీసుకున్న ఫొటోలు, వీడియోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో దర్శకుడు ఆర్.పార్థిబన్ కూతురు కీర్తనతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఏకా పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. వధూవరుల వీడియోను షేర్ చేస్తూ "అత్యంత అందమైన వధువును చూశాను. లవ్ యూ మై ఏకు" అని క్యాప్షన్ ఇచ్చింది
సెల్ఫీ
"నార్త్ ఇండియన్ షాదీస్ ఒక వైబ్" అని వధూవరులు పూలమాలలు మార్చుకునే వీడియోను కూడా త్రిష పోస్ట్ చేసింది. అంతేకాకుండా రచయిత-దర్శకురాలు సనా మరియం షేర్ చేసిన చిత్రాన్ని కూడా త్రిష రీపోస్ట్ చేసింది. ఆ చిత్రంలో పార్థిబన్ కూతురు కీర్తనతో పాటు ఇతర అతిథులతో కలిసి త్రిష సెల్ఫీ దిగుతున్నట్లు ఉంది. దాన్ని పోస్ట్ చేస్తూ "ది జెన్ Z's అండ్ ఐ" అని త్రిష రాసింది. మరో చిత్రంలో కీర్తన, త్రిష పక్కపక్కనే నిలబడి పెళ్లి అతిథులతో కలిసి ఫోజులిచ్చారు.

మణిరత్నంతో
త్రిష తన 'ఫేవరేట్' డైరెక్టర్ మణిరత్నంను కూడా పెళ్లిలో కలిసింది. మణిరత్నంతో కలిసి ఒక ఫోటో దిగింది. ఆ చిత్రంలో నటుడు సిద్ధార్థ్ వారి వెనుక నిలబడి ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. "అవుట్ అండ్ అబౌట్" అనే క్యాప్షన్ తో త్రిష.. పర్పుల్ పట్టు చీరలో, బంగారు ఆభరణాలతో ముస్తాబైన తన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
పార్థిబన్ ఏమన్నాడంటే?
తమిళ స్టార్ హీరో విజయ్ కు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని అతని భార్య సంగీత ఆరోపించింది. విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే త్రిషతో కలిసి విజయ్ ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు అటెండ్ అయ్యాడు. దీనిపై పార్థిబన్ స్పందిస్తూ.. ‘‘ఈ కుందవాయిని (పొన్నియిన్ సెల్వంలో త్రిష పాత్ర) కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి. అది మంచిది. ఆమె బయటకు రాకుండా చూసుకోండి" అని వ్యాఖ్యానించాడు.
పార్థిబన్ కామెంట్లపై త్రిష ఫైర్ అయింది. చేతిలో మైక్ ఉందని ఏది పడితే అది వాగడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది. చివరకు పార్థిబన్ సారీ చెప్పాడు. అయితే తాను త్రిషను మాత్రమే విమర్శించలేదని విజయ్ కూడా ఇందులో భాగమేనని పార్థిబన్ మళ్లీ పేర్కొన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












