Vijay Son: విజయ్ ఫ్యామిలీలో చిచ్చు.. సొంత కొడుకే ఎదురు తిరిగితే సీఎం అయినట్లేనా? సోషల్ మీడియాలో సెటైర్లు
Vijay Son: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు తన తల్లికే సపోర్ట్ గా పేరులో మార్పులు చేసుకున్నాడని తెలిసింది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమో జన నాయగన్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. మరోవైపు త్రిషతో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రికి మరో షాకిచ్చాడని తెలుస్తోంది.

తల్లికి సపోర్ట్
దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రికి వ్యతిరేకంగా మారాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. తల్లి సంగీతకే అతను సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు. విజయ్ మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో సంగీత విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో తల్లికే జేసన్ సంజయ్ సపోర్ట్ గా నిలుస్తున్నాడని టాక్.
పేరులో మార్పు
తల్లి సంగీతకు మద్దతుగా జేసన్ సంజయ్ తన పేరులో చిన్న మార్పు చేసుకున్నాడని అంటున్నారు. సాధారణంగా పిల్లల పేరులో తండ్రి పేరు ఉంటుంది. విజయ్ కొడుకు పేరు కూడా ముందు జేసన్ సంజయ్ విజయ్ గా ఉండేది. తండ్రి పేరులోని ఫస్ట్ అక్షరం ‘వి’ని జేసన్ సంజయ్ తన పేరులో పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు తల్లికి సపోర్ట్ గా జేసన్ సంజయ్ సంగీత అని అతను పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జేసన్ సంజయ్ ఎస్ అని పెట్టుకున్నాడని అంటున్నారు.
మూవీ క్రెడిట్స్ లోనూ
జేసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతున్నాడు. సందీప్ కిషోన్ హీరోగా ‘సిగ్నా’ అనే సినిమాను సంజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ క్రెడిట్స్ లో కూడా జేసన్ సంజయ్ ఎస్ గా అతను పేరు మార్చుకున్నాడని తెలిసిందే. తల్లి సంగీతకు సపోర్ట్ గా తన పేరులో ఎస్ ను చేర్చుకున్నాడని సమాచారం.
అన్ ఫాలో
ఇప్పటికే తండ్రి దళపతి విజయ్ ను సోషల్ మీడియాలో జేసన్ సంజయ్ అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తండ్రి నుంచి విడాకులు కోరుతున్న తల్లికి సపోర్ట్ గా అతను తన పేరులో తండ్రి అక్షరాన్ని తీసేసి తల్లి అక్షరాన్ని పెట్టుకున్నాడనే సంచలనంగా మారింది.
సీఎం అయినట్లే
తండ్రి విజయ్ కు సొంత కొడుకు జేసన్ సంజయ్ ఎదురు తిరిగాడనేది చర్చనీయాంశమైంది. దీంతో ఇక విజయ్ సీఎం అయినట్లేననే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ముందు ఫ్యామిలీలో ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలని విజయ్ ను విమర్శిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్ తన పొలిటికల్ కెరీర్ కోసం సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


