Thalapathy Vijay: భార్యను గౌరవించలేని వ్యక్తి.. ఇక సమాజాన్ని ఏం మారుస్తాడు.. దళపతి విజయ్ పై సొంత పార్టీ మహిళా నేత ఫైర్

Thalapathy Vijay: దళపతి విజయ్ కు సొంత పార్టీ నుంచే సెగ తగులుతోంది. తన వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తనపై టీవీకే మహిళా నేత రంజన నచ్చియార్ ఫైర్ అయింది. భార్యను గౌరవించలేని వ్యక్తి ఇక సమాజాన్ని ఏం మారుస్తాడని రంజన ప్రశ్నించింది. 

Published on: Mar 11, 2026, 05:44:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై సొంత పార్టీలోని నేతల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని వ్యక్తిగత జీవితం, భార్య విడాకులు కోరడం, హీరోయిన్ త్రిషతో సంబంధం రూమర్లు హాట్ టాపిక్స్ గా మారాయి. ఇప్పుడు టీవీకే పార్టీ మహిళా నేత రంజన నచ్చియార్ తమ చీఫ్ విజయ్ పై మండిపడింది.

విజయ్, త్రిష (PTI/ X)
విజయ్, త్రిష (PTI/ X)

భార్యపై విజయ్ కామెంట్లు

తాజాగా మమల్లపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి దళపతి విజయ్ మాట్లాడాడు. తన వ్యక్తిగత సమస్యల గురించి బాధపడొద్దని, తానే అంతా చూసుకుంటానని విజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే తన భార్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆమె అంత విలువైందేమీ కాదని విజయ్ అన్నాడు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలను టీవీకే పార్టీ మహిళా నేత రంజన ప్రశ్నించింది.

మార్పు తెస్తాడని

బీజేపీని వీడి టీవీకేలో చేరిన రంజన నచ్చియార్ పార్టీ అధినేత విజయ్ ను విమర్శించింది. మహిళల పట్ల గౌరవం తమ సొంత కుటుంబం నుంచే మొదలవ్వాలని ఆమె పేర్కొంది.

ఏఎన్ఐ తో రంజన మాట్లాడుతూ.. ‘‘నాయకుడు మహిళలను గౌరవించాలి. మేమందరం మా నాయకుడు విజయ్‌ను గౌరవిస్తాం. అతను పార్టీలో మార్పు తెస్తాడని, అది తమిళనాడులో మార్పు తెస్తుందని అనుకుంటున్నాం. మహిళలకు మరింత గౌరవం, సమాన స్థానం కల్పిస్తాడని మేమందరం ఆశిస్తున్నాం. కానీ మహిళా దినోత్సవ వేడుకలో అతను చేసిన ప్రకటన మాత్రం సరికాదు’’ అని రంజన తెలిపింది.

వైరల్ కావడంతో

‘‘తన భార్య విడాకుల కేసు దాఖలు చేసిందని విజయ్ అందరికీ చెప్పాడు. అది అతని వ్యక్తిగత విషయం, కాబట్టి మేము దానిని మీడియాలో చర్చించకూడదని కోరుకుంటున్నాం. కానీ అతను తన భార్య 'విలువైనది కాదు' అని చెప్పడం వల్ల ఇది వైరల్ అయింది. బహుశా అతని భార్య లేదా అతని వివాహ జీవితం ఏదైనా కావచ్చు, కానీ 'విలువైనది కాదు' అనే పదం అతణ్ని ప్రశ్నించేలా చేసింది’’ అని రంజన పేర్కొంది.

ఎలా గౌరవిస్తాడు?

‘‘అతను తన సొంత భార్యను గౌరవించడం లేదు. ఇతర మహిళలను, కార్యకర్తలను, ప్రజలను గౌరవిస్తాడని ఏలా మేం నమ్మగలం? సమాజాన్ని ఏం మారుస్తాడు? అతను మహిళల కోసం ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, కానీ అతను ముందుగా తన కుటుంబాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో స్త్రీని పూజించాలి. అతని సొంత భార్య ఇద్దరు పిల్లలను కన్నది. ఆమె అతనితో 25 సంవత్సరాలకు పైగా జీవించింది. కాబట్టి అన్నింటికంటే ముందు అతను తన సొంత కుటుంబాన్ని గౌరవించాలి. తమిళనాడుకు నాయకుడు కావడానికంటే కూడా అదే ముఖ్యం’’ అని రంజన్ తెలిపింది.

చెడు ట్రెండ్

‘‘విజయ్ మారతాడాని ఆశిస్తున్నా. అతను తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలి. అన్నింటికంటే మించి అతను జెన్ జి పిల్లలకు చెడు ట్రెండ్‌ను సెట్ చేయకూడదు. వెడ్డింగ్ రిసెప్షన్ కు మరో హీరోయిన్ తో వెళ్లడమనేది చెడు ట్రెండ్ సెట్టింగ్’’ అని రంజన మండిపడింది.

విడాకుల కోరుతూ

విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఓ హీరోయిన్ తో విజయ్ కు అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్ కు త్రిషతో కలిసి విజయ్ అటెండ్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More