Trisha: అది నీ మూర్ఖత్వం.. చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది వాగేస్తావా: పార్థిబన్‌కు త్రిష పరోక్ష కౌంటర్

Trisha: తాను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలని తమిళ నటుడు పార్థిబన్ తనపై చేసిన కామెంట్స్ కు త్రిష పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. అతని పేరు ఎత్తకుండానే ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అజ్ఞానం అంటూ ఘాటు కామెంట్స్ చేసింది.

Mar 9, 2026, 09:24:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి త్రిష కృష్ణన్ ఆదివారం (మార్చి 8) రాత్రి 'ఎక్స్' వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె మాటల్లోని పదును చూస్తుంటే అది తన 'పొన్నియిన్ సెల్వన్' కో-స్టార్ ఆర్. పార్థిబన్‌ను ఉద్దేశించినదేనని స్పష్టమవుతోంది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది వాగొద్దు అన్నట్లుగా ఆమె కామెంట్స్ ఉన్నాయి. తాను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలన్న కామెంట్స్ కు ఇది కౌంటర్ అని భావిస్తున్నారు.

Trisha: అది నీ అజ్ఞానం.. చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది వాగేస్తావా: పార్థిబన్‌కు త్రిష పరోక్ష కౌంటర్
Trisha: అది నీ అజ్ఞానం.. చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది వాగేస్తావా: పార్థిబన్‌కు త్రిష పరోక్ష కౌంటర్

త్రిష ఏమన్నదంటే?

ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించింది. "ఒక కార్యక్రమ నిర్వాహకులు నాకు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరును, ఫోటోను ఆ ఈవెంట్‌లో చేర్చారు" అని ఆమె పేర్కొంది.

అనంతరం తనపై వచ్చిన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ.. "చేతిలో మైక్రోఫోన్ ఉన్నంత మాత్రాన చేసే కామెంట్స్ తెలివైనవిగానో లేదా కామెడీగానో మారిపోవు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది. అవతలి వ్యక్తి గురించి తెలియకుండా వాడే అసభ్యకర పదజాలం.. ఆ వ్యక్తి గురించి కంటే, మాట్లాడే వారి సంస్కారం గురించే ఎక్కువగా చెబుతుంది" అని త్రిష ఘాటుగా సమాధానమిచ్చింది.

వివాదానికి కారణం ఇదే

గలాటా అవార్డ్స్ వేడుకలో పార్థిబన్ స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. స్క్రీన్ పై త్రిష ఫోటో కనిపించింది. అప్పుడు అతడు స్పందిస్తూ.. "ఈ కుందవైని (పొన్నియిన్ సెల్వన్‌లో త్రిష పాత్ర పేరు) కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఒక వివాహ వేడుకకు త్రిష, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌తో కలిసి జంటగా హాజరుకావడంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఉద్దేశించే పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆ పెళ్లి వేడుకలో వీరిద్దరూ సాధారణంగానే కొత్త జంటను ఆశీర్వదించి వెళ్లినప్పటికీ, కొందరు దీనిని వివాదాస్పదం చేశారు.

విజయ్ - సంగీత విడాకుల కేసులో తాజా పరిణామాలు

మరోవైపు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్ తమిళనాడులో సంచలనంగా మారింది. చెంగల్పట్టు మహిళా కోర్టు ఈ కేసును ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి బదిలీ చేసింది. ఏప్రిల్ 20న జరిగే తదుపరి విచారణకు విజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఒక నటితో ఉన్న సంబంధం గురించి తనకు తెలిసిందని, అది తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విడాకుల విచారణ కొనసాగుతుండగానే, చెన్నై నీలాంకరైలోని తమ ఇంట్లోనే ఉండే హక్కు కల్పించాలని, అలాగే తనకు, తన ఇద్దరు పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలని కోరుతూ సంగీత తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు.

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కీలక సమయంలో ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More