HAIKU OTT Rights: అందమైన కవితల కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ సినిమా హైకూ టీజర్- ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్

Haiku Teaser Released And OTT Rights: తెలుగులో సూపర్ హిట్ అయిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల నటించిన లేటెస్ట్ తమిళ రొమాంటిక్ సినిమా హైకూ. ఏగన్ హీరోగా తెరకెక్కిన హైకూ టీజర్ బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కు ముందే హైకూ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది.

Published on: Sep 10, 2026, 11:31:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Haiku Teaser Released And OTT Rights: విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా ‘హైకూ’. ఈ సినిమా టీజర్‌ను తమిళ రొమాంటిక్ హీరో హరీష్ కల్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది.

అందమైన కవితల కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ సినిమా హైకూ టీజర్- ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్
అందమైన కవితల కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ సినిమా హైకూ టీజర్- ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్

ఆకర్షణీయమైన విజువల్స్

ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన హైకూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

నేటి ట్రెండ్‌కు తగ్గ కథ, కథనం, బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో పాటు మనసును హత్తుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసేలా ‘హైకూ’ టీజర్‌ను రూపొందించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఈ అందమైన రంగుల ప్రేమ ప్రపంచానికి ఏగన్, శ్రీదేవిలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, హావభావాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గతంలో ‘కోళి పన్నై’, ‘చెల్లదురై’ చిత్రాల్లో తన సహజమైన, పల్లెటూరి నేపథ్యానికి తగ్గ నటనతో ప్రశంసలు అందుకున్న ఏగన్.. ‘హైకూ’లో మాత్రం సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నాడు.

సహజ నటనతో కోర్ట్ మూవీ హీరోయిన్

సిటీ కల్చర్‌కు తగ్గ కూల్, అమాయకమైన పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో ఏగన్ ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ సినిమాలో కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి అపల్ల కూడా తనదైన సహజమైన నటనతో ఏగన్ సరసన చక్కటి జోడీగా కుదిరింది. వీరిద్దరి కెమిస్ట్రీ టీజర్‌లోని అందమైన, ఆహ్లాదకరమైన క్షణాలను మరింత బలంగా మార్చింది.

హైకూ టీజర్ ఎండింగ్‌లో ఫెమినా జార్జ్ ఎంట్రీ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా.. తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. ‘హైకూ’లోని రొమాంటిక్ ఫీల్‌కు సిద్ధు కుమార్ సంగీతం మెయిన్ ఎసెట్‌గా మారింది.

ముఖ్యంగా మృదువైన వయొలిన్ బిట్స్‌ను క్లాసికల్ రాగాలు, కాంటెంపరరీ ఫ్యూజన్‌తో మేళవించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఆహ్లాదకరమైన విజువల్స్‌కు చక్కగా తోడై టీజర్‌కు మరింత మ్యూజికల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ప్రేక్షకులను ఓ అందమైన, రంగులతో నిండిన ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘హైకూ’ టీజర్‌ను చక్కగా తీర్చిదిద్దారు.

ఫ్రెష్ అండ్ క్యూట్‌గా హైకూ టీజర్

ప్రేమలోని పరిచయమైన భావోద్వేగాలను రచయిత, దర్శకుడు యువరాజ్ చిన్నసామి తన ఫ్రెష్ ప్రజెంటేషన్‌తో కొత్తగా చూపించారు. దీంతో ‘హైకూ’ టీజర్ ఫ్రెష్‌గా, క్యూట్‌గా అనిపిస్తోంది.

‘హైకూ’ టీజర్ ఇప్పటికే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమిళ ప్రేక్షకుల్లో రొమాంటిక్ కథలకు మరోసారి మంచి ఆదరణ లభిస్తోన్న సమయంలో ఈ టీజర్ రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. యూత్‌ఫుల్ కాస్టింగ్, ఆకట్టుకునే విజువల్స్, హృద్యమైన సంగీతం, ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌తో ‘హైకూ’ ఈ సీజన్‌లో రాబోతున్న ఆసక్తికరమైన రొమాంటిక్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోందనిపిస్తోంది.

‘హైకూ’ సినిమాకు మరో ప్రధానమైన అంశం ఏమిటంటే.. షూటింగ్ పూర్తికాకముందే హైకూ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో.. ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీతో డీల్

ప్రస్తుతం ఓటీటీ భాగస్వామ్యాల కోసం పోటీ మరింత పెరిగిన సమయంలో.. ‘హైకూ’కు ఇంత ముందుగానే డిజిటల్ డీల్ క్లోజ్ కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. కాగా, యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైకూ’ చిత్రాన్ని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు.

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శక్తి ప్రణేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిద్ధు కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.

అందమైన విజువల్స్‌తో

రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసిన ‘హైకూ’ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమా 2026 అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More