Vishal: ఎంజీఆర్ పై కామెంట్లు.. రాజేంద్రప్రసాద్ సారీ చెప్పాల్సిందేనన్న తమిళ హీరో విశాల్

Vishal: తెలుగు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తరుచుగా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా తమిళ దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి. రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాల్సిందేనని తమిళ హీరో విశాల్ తాజాగా డిమాండ్ చేశాడు.

Published on: Mar 12, 2026, 13:48:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వివాదాలతోనే సావాహం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతంలో ఓ వేదికపై బ్రహ్మానందం గురించి అనకూడని మాట అన్నారు. ఆ తర్వాత ఓ పెళ్లి ఈవెంట్లో సెల్ఫీ అడిగిన ఓ బాలుడిని తోసేశారు. ఇప్పుడేమో తమిళ దిగ్గజ నటుడు, మాజీ సీఎం ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

విశాల్
విశాల్

రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు

రీసెంట్ గా హైదరాబాద్ లో ‘కళాప్రపుర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నోరు జారారు. ‘‘ఒకప్పుడు కాంతారావు జానపదా చిత్రాల కోసం జనాలు ఎగబడేవాళ్లు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు ఉ**’’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

విశాల్ పోస్టు

ఎంజీఆర్ ను రాజేంద్ర ప్రసాద్ నోటికొచ్చిన మాటలు అనడంపై తమిళనాడు ప్రజలు, కోలీవుడ్ సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. హీరోలు కూడా రియాక్టవుతున్నారు. తమిళ హీరో విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ ను సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు.

‘‘తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఈవెంట్లో చేసిన కామెంట్లు విని షాక్ కు గురయ్యా’’ అని తన పోస్టులో విశాల్ రాసుకొచ్చాడు.

స్పీచ్ ఖండిస్తూ

‘‘లెజండరీ యాక్టర్, వన్ అండ్ ఓన్లీ ఎంజీఆర్ గురించి మీ స్పీచ్ ను బరువైన హృద‌యంతో ఖండిస్తున్నా. దివంగత ఎంజీఆర్ కేవలం దిగ్గజ నటుడు మాత్రమే కాదు తమిళనాడులో గొప్ప లీడర్. మరో దిగ్గజ నటుడు కాంతారావును పొగుడుతూ మీరు మాట్లాడటం బాగుంది. కానీ కాంతారావు గురించి పొగుడుతూ ఎంజీఆర్ ను తక్కువ చేయడం సరికాదు’’ అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నాడు.

సారీ చెప్పాలని

‘‘మా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండే ఎంజీఆర్ ను అలా అనడం కరెక్ట్ కాదు. ఈ దశలో ఈ కాంట్రవర్సీకి ముగింపు పలకాలి. అది ఎలాగో మీకు బాగా తెలుసు. క్షమాపణ చెప్పి ఈ సమస్యకు ఎండ్ కార్డు వేయండి. మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి’’ అని విశాల్ తెలిపాడు.

‘‘ఫ్యూచర్ లో ఇంకా ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఓ నటుడిగా నేను క్షమాపణలు డిమాండ్ చేస్తా’’ అని విశాల్ తన పోస్టును ముగించాడు.

సెలబ్రిటీలు కూడా

రాజేంద్ర ప్రసాద్ కామెంట్లపై ఇతర తమిళ సినీ సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. మరో సీనియర్ నటుడు నాజర్ కూడా రాజేంద్ర ప్రసాద్ ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More