Malayalam OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన రెండు క్రేజీ మలయాళం సినిమాలు.. జీతు జోసెఫ్ క్రైమ్ థ్రిల్లర్.. సైన్స్ ఫిక్షన్ మూవీ
Malayalam OTT: ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఒకటి జీతు జోసెఫ్ క్రైమ్ థ్రిల్లర్ కాగా.. మరొకటి వర్చువల్ రియాలిటీ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ. వీటిపై ఓ లుక్కేయండి.
ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీస్ ను బాగా ఆదరిస్తారు. ఇక అందులోనూ మలయాళం థ్రిల్లర్లు అంటే పడిపడి చూస్తారు. ఈ రోజు (మార్చి 27) అలాంటి రెండు మలయాళం థ్రిల్లర్లు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా, మరొకటి సైన్స్ ఫిక్షన్ మూవీ.

వలతు వశతే కల్లన్
జీతూ జోసెఫ్.. ఈ మలయాళ డైరెక్టర్ పేరు తెలియని మూవీ లవర్ ఉండడనే చెప్పొచ్చు. దృశ్యం లాంటి థ్రిల్లర్ ను అందించింది అతనే. ఇప్పుడీ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ ఓటీటీలోకి వచ్చేసింది.
మూడు ఓటీటీల్లో
‘వలతు వశతే కల్లన్’ మూవీ ఏకంగా మూడు ఓటీటీల్లో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ మూవీ రిలీజైంది. ఇందులో బిజు మీనన్, జోజు జార్జ్ ప్రధాన పాత్రలు పోషించారు.
వలతు వశతే కల్లన్ స్టోరీ
జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశతే కల్లన్’ జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఆంటోనీ జేవియర్ (బిజు మీనన్) ఇరీన్ అనే అమ్మాయి మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఇరీన్ తండ్రి సామ్ (జోజు జార్జ్) జేవియర్ కొడుకు ఫిలిప్ ను కిడ్నాప్ చేస్తాడు.
ఇరీన్ ను హత్య చేశానని ఒప్పుకోవాలని జేవియర్ ను సామ్ డిమాండ్ చేస్తాడు. మరి ఈ హత్య ఎవరు చేశారు? ఫిలిప్ ను సామ్ విడిచి పెట్టాడా? లేదా అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మస్తిష్క మరణం
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మరో క్రేజీ మలయాళం సినిమా ‘మస్తిష్క మరణం’. వర్చువల్ రియాలిటీకి, రియాలిటీకి తేడా ఏదో తెలియకుండా కన్ఫ్యూజ్ చేసే సినిమా ఇది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ
మస్తిష్క మరణం సినిమాలో రజిష విజయన్, నిరంజ్, దివ్య, శాంతి తదితరులు నటించారు. ఈ మూవీకి క్రిషంద్ డైరెక్టర్. ఈ కథ రెండు భాగాలుగా సాగుతుంది. ఒక ఫీమేల్ సెలబ్రిటీ పెద్ద స్కాండల్ లో చిక్కుకుంటుంది. ఆమెపై మీడియాలో రకరకాల కథనాలు వస్తాయి.
మరోవైపు కోల్పోయిన తన బిడ్డను వర్చువల్ రియాలిటీ ద్వారా కలవాలని ఓ తండ్రి ఆశపడుతుంటాడు. అసలు ఏది నిజం? ఏది వర్చువల్ రియాలిటీ? అనేది కూడా తేల్చుకోలేని స్థితికి వెళ్లిపోతాడు. మరి చివరకు ఏం జరిగిందో తెలియాలంటే మస్తిష్క మరణం చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


