OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు

ఓటీటీని తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయనం షేక్ చేస్తోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. 

Published on: Feb 08, 2026 5:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నయనం అదరగొడుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో దూసుకెళ్తోంది. హీరోగా థియేటర్లలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న వరుణ్ ఈ సిరీస్ తోనే ఓటీటీ డెబ్యూ చేశాడు. ఇందులో కళ్ల డాక్టర్ గా వరుణ్ నటించాడు.

ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ (x/ZEE5Telugu)
ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ (x/ZEE5Telugu)

నయనం ఓటీటీ

తెలుగు సస్పెన్స్ సైకో క్రైమ్ థ్రిల్లర్ నయనం వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. డిసెంబర్ 19, 2025న ఇది జీ5 ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేసింది. జీ5 ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది నయనం. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.

100 మిలియన్ మినిట్స్

నయనం వెబ్ సిరీస్ తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటింది. ఈ విషయాన్ని పేర్కొంటూ జీ5 ఓటీటీ ఆదివారం (ఫిబ్రవరి 8) సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును నయనం ఖాతాలో వేసుకుంది.

ఉత్కంఠ పెంచుతూ

నయనం వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. ఈ ఎపిసోడ్లు అన్నీ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్ కు ఉత్కంఠ పెంచుతూ సాగే స్టోరీ లైన్ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ సందేశ్, ఉత్తేజ్, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, అలీ రెజా తదితరులు నటించారు. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

నయనం సిరీస్ స్టోరీ

ఇది ఓ కళ్ల డాక్టర్ కథ. తాను ప్రత్యేకంగా డిజైన్ చేసిన కళ్ల అద్దాలతో అవతలి వాళ్లు ఏం చేస్తున్నారనేది నాలుగు నిమిషాల పాటు చూస్తాడు ఈ డాక్టర్. నయన్ (వరుణ్ సందేశ్) ఓ కళ్ల డాక్టర్ గా పేషంట్లను ట్రీట్ చేస్తాడు . కళ్ల సమస్యలు ఉన్న పేషెంట్లకు తన క్లినిక్ లో చికిత్స అందిస్తుంటాడు. అయితే సీక్రెట్ గా తన దగ్గర ఉన్న ఓ స్పెషల్ కళ్లద్దాల ద్వారా తన దగ్గరకు వచ్చే పేషెంట్ల అద్దాలకు ఉన్న లెన్స్ తో నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది డాక్టర్ కూడా చూడగలడు.

ఆ ట్విస్ట్

పేషెంట్లను ట్రీట్ చేసే నయన్ దగ్గరికి మాధవి (ప్రియాంక జైన్) వస్తుంది. మాధవిని ఇష్టపడతాడు నయన్. కానీ ఆమెకు అప్పటికే పెళ్లవుతుంది. ఈ క్రమంలోనే మాధవి భర్త చనిపోతాడు. మరి ఈ హత్య చేసింది ఎవరు అని కనిపెట్టేందుకు పోలీస్ ఆఫీసర్ గా అలీ రెజా రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే నయనం వెబ్ సిరీస్ చూడాల్సిందే.