Jailer 2 OTT: షాకింగ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్ 2.. స్ట్రీమింగ్ అప్పుడే.. దిమ్మతిరిగేలా రికార్డు ఓటీటీ డీల్!
Jailer 2 OTT Release Date: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఓ వైపు కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఏమో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై షాకింగ్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ డీల్, స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన వివరాలు మీకోసం.
Jailer 2 OTT Release Date: అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ 2 (Jailer 2) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' గా మరోసారి విశ్వరూపం చూపించారు. ఇప్పుడు థియేటర్లు జైలర్ 2 మేనియాతో ఊగిపోతున్నాయి.

రికార్డు కలెక్షన్లు
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం.. రిలీజైన కేవలం 9 రోజుల్లోనే జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.628 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇండియాలో రూ.350 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20 ఇండియన్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో రికార్డులు కొల్లగొడుతున్న జైలర్ 2 ఓటీటీ రిలీజ్ పై షాకింగ్ బజ్ వైరల్ గా మారింది. పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కు ప్రైమ్ వీడియోకు మధ్య థియేట్రికల్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు మధ్య 4 వారాల గ్యాప్ ఉండేలా డీల్ కుదిరింది.
దీని ప్రకారం నవంబర్ 12 నుంచి రజినీకాంత్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది.
కళ్లు చెదిరే ఓటీటీ డీల్ వాల్యూ
జైలర్ 2 సినిమా ఓటీటీ రైట్స్ డీల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.160 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ఓటీటీ డీల్ జరగడం ఇదే తొలిసారి అని, ఇది సరికొత్త రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ ఫీస్ట్
అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్, రజినీకాంత్ అన్ మ్యాచబుల్ స్వాగ్, నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ.. వెరసి జైలర్ 2 ప్రేక్షకులకు ఓ మాస్ ఫెస్టివల్ లాంటి అనుభూతిని ఇస్తోంది. ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, విద్యా బాలన్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు నవంబర్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


