Netflix: నెట్‌ఫ్లిక్స్ కొరియా పండ‌గ‌.. స్ట్రీమింగ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కే-డ్రామాలు.. ఓటీటీ లవర్స్‌కి గ్లోబల్ దావత్!

Netflix: ఓటీటీ ప్రపంచాన్ని శాసిస్తున్న కొరియన్ డ్రామాలు నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరో భారీ సంబరానికి సిద్ధమయ్యాయి. దక్షిణ కొరియాలో నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'నెట్‌ఫ్-జాంచి' పేరుతో భారీ గ్లోబల్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. కే డ్రామాల ఓటీటీ రిలీజ్ లను ప్రకటించనున్నారు.

Published on: Oct 20, 2026, 11:57:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix: 2016 జనవరిలో దక్షిణ కొరియాలో సేవలు ప్రారంభించిన నెట్‌ఫ్లిక్స్, గడచిన దశాబ్ద కాలంలో గ్లోబల్ కంటెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఈ 10 ఏళ్ల విజయాన్ని వేడుకగా జరుపుకునేందుకు 'నెట్‌ఫ్-జాంచి' (కొరియన్ భాషలో 'జాంచి' అంటే విందు/దావత్ అని అర్థం) పేరుతో సీయోల్‌లోని 'సాంగం-డాంగ్ ఆయిల్ ట్యాంక్ కల్చర్ పార్క్'లో అక్టోబర్ 24, 25 తేదీల్లో రెండు రోజుల ఫెస్టివల్‌ను ప్లాన్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్ కొరియా పండ‌గ‌.. స్ట్రీమింగ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కే-డ్రామాలు.. ఓటీటీ లవర్స్‌కి గ్లోబల్ దావత్!
నెట్‌ఫ్లిక్స్ కొరియా పండ‌గ‌.. స్ట్రీమింగ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ కే-డ్రామాలు.. ఓటీటీ లవర్స్‌కి గ్లోబల్ దావత్!

ఫెస్టివల్‌ అట్రాక్షన్స్

ఈ 'నెట్‌ఫ్-జాంచి' ఫెస్టివల్‌లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక కొరియన్ ప్రాజెక్టులకు సంబంధించిన టీజర్లు, కాస్ట్ అనౌన్స్‌మెంట్లు, ఫస్ట్ లుక్‌లను మేకర్స్ రివీల్ చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారీ కే డ్రామాల లైనప్ తో ఓటీటీ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయనుంది.

ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2 (All of Us Are Dead Season 2)

గ్లోబల్ సెన్సేషన్ సృష్టించిన కే-జాంబీ థ్రిల్లర్ రెండవ భాగం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల్లో ఉంది. హ్యోసాన్ హైస్కూల్ నుంచి బతికి బయటపడిన విద్యార్థుల తదుపరి పోరాటంపై ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేక టీజర్ లేదా కాస్ట్ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది.

సోలో లెవెలింగ్ (Solo Leveling)

అంతర్జాతీయంగా ఆదరణ పొందిన వెబ్‌టూన్ అండ్ యానిమే 'సోలో లెవెలింగ్' అడాప్టేషన్, లైవ్-యాక్షన్ ప్రాజెక్ట్ వివరాలను ఈ వేదికగా పంచుకోనున్నారు.

గ్రాండ్ గెలాక్సీ హోటల్ (Grand Galaxy Hotel)

మైండ్-బెండింగ్ కాన్సెప్ట్‌తో రాబోతున్న కొత్త ఫాంటసీ డ్రామా వివరాలను ఈ ఫెస్టివల్ లో రివీల్ చేయబోతున్నారు.

పాజిబుల్ లవ్ (Possible Love)

ప్రముఖ దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందగా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించనున్నారు.

తంతారా / స్లోలీ ఇంటెన్స్లీ (Tantara / Slowly, Intensely)

సరికొత్త రొమాంటిక్ డ్రామాగా రాబోతున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ కానుంది.

బ్యూటీ ఇన్ ది బీస్ట్ (Beauty in the Beast)

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రొడక్షన్‌గా రాబోతున్న డార్క్ డ్రామా వివరాలు బయటకు రానున్నాయి.

కే-డ్రామాల ఆధిపత్యం

కొరియన్ కంటెంట్ అనేది కేవలం తూర్పు ఆసియాకే పరిమితం కాకుండా, భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లోనూ (AP & Telangana) డిజిటల్ వీక్షకులను భారీగా ఆకర్షిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా గణాంకాల ప్రకారం.. తెలుగులో డబ్ అయిన 'స్క్రిడ్ గేమ్', 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ (Season 1)', 'స్వీట్ హోమ్' వంటి డార్క్ థ్రిల్లర్ సిరీస్‌లకు సౌత్ ఇండియాలో అత్యధిక వ్యూయర్‌షిప్ నమోదైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More