OTT Deal: ఓటీటీ డీల్‌తో మూవీ బడ్జెట్ రిటర్న్-థియేటర్లలో వచ్చేవి లాభాలే-దుల్కర్ సల్మాన్ మూవీ క్రేజ్ మామూలుగా లేదు
OTT Deal: దుల్కర్ సల్మాన్ అప్ కమింగ్ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు. ఆకాశంలో ఒక తార అనే ఫీల్ గుడ్ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు దుల్కర్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తోనే తిరిగొచ్చిందనే టాక్ వైరల్ గా మారింది.
OTT Deal: దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాదినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫీల్-గుడ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) థియేట్రికల్ విడుదలకు ముందే బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆల్-లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని తెలిసింది. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే మూవీ బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోవడం విశేషం.

నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్ల డీల్
ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే కథాంశంతో వస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) స్ట్రీమింగ్ హక్కులను రూ.60 కోట్లకు సొంతం చేసుకుందని తెలిసింది.
సేఫ్ జోన్ లోకి మూవీ
ఒక కంటెంట్-డ్రివెన్ డ్రామా చిత్రానికి థియేట్రికల్ రిలీజ్‌కి ముందే కేవలం డిజిటల్ బిజినెస్ ద్వారానే బడ్జెట్ అంతా రికవర్ అవ్వడం సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డుగా నిలిచింది. దీంతో ఈ ఆకాశంలో ఒక తార ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డీల్ తో నిర్మాతలు పూర్తి సేఫ్ జోన్‌లోకి వెళ్లడమే కాకుండా భారీ లాభాల్లోకి అడుగుపెట్టారు.
వైజయంతీ, గీతా ఆర్ట్స్ కలిసి
దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ రైడ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, సినీ దిగ్గజం గుణ్ణం గంగరాజు కథ, స్క్రీన్‌ప్లే అందించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. నూతన నటి సాత్విక వీరపల్లి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతుండగా, స్టార్ నటి శ్రుతి హాసన్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 20, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
దుల్కర్ సల్మాన్ ఓటీటీ ట్రాక్ రికార్డ్
'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల వరుస విజయాలు దుల్కర్ మార్కెట్‌ను ప్యాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి. మలయాళం, తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సబ్‌స్క్రైబర్‌లను ఆకట్టుకునే శక్తి ఆయనకు ఉండటం వల్లే నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించడానికి వెనుకాడలేదని టాక్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


