Friday OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ 5 సినిమాలు- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5లో!

Friday OTT Releases October 2: ఇవాళ ఓటీటీలోకి తప్పకుండా చూసేలా బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ వేదికల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్లు, హారర్, రొమాంటిక్ కామెడీ సినిమాల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 2, 2026, 13:14:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Best 5 OTT Release Movies Today Friday: ఇవాళ (అక్టోబర్ 2) గాంధీ జయంతి పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటీటీ ప్రియులకు వినోదాల విందు సిద్ధమైంది. అక్టోబర్ 2న థియేటర్లలోనే కాకుండా వివిధ ఓటీటీల్లో విభిన్న జోనర్లలో తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇవాళ ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ 5 సినిమాలు- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5లో!
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ 5 సినిమాలు- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్- జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5లో!

ఓటీటీలో బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు

ఇందులో ఇవాళ ఓటీటీలో ది బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, హారర్ వంటి విభిన్న జోనర్లలో తప్పకుండా చూడాలనిపించే ఆ టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పూజా మేరీ జాన్ (Pooja Meri Jaan) - జీ5

మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన 'పూజా మేరీ జాన్' చిత్రం జీ5 (ZEE5) వేదికగా ఓటీటీ రిలీజ్ అయింది. 'సీతా రామం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ నటించిన లీగల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

నవజోత్ గులాటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. వన్ సైడ్ లవ్, వేధింపులు (స్టాకింగ్), విషపూరితమైన వ్యామోహం, ఆమోదం (కన్సెంట్) వంటి అంశాల చుట్టూ కోర్టు రూమ్ డ్రామాగా కథ సాగుతుంది.

బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) - జియోహాట్‌స్టార్

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'బెత్లెహెం కుటుంబ యూనిట్' జియోహాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆష్లీ (మమితా బైజు) జీవితంలోకి పక్కింట్లో జరిగే ఒక పెళ్లి వేడుక ఎలాంటి మార్పు తెచ్చింది? తన తొలిప్రేమ జస్టిన్ (నివిన్ పౌలీ) జ్ఞాపకాలు మళ్లీ ఎలా చిగురించాయనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

తెలుగులోనూ మంచి ఆదరణ ఉన్న నివిన్ పౌలీ, మమితా బైజు కాంబినేషన్ కావడంతో ఈ చిత్రం దక్షిణ భారత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జియోహాట్‌స్టార్‌లో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ రిలీజ్ అయింది.

#లవ్ (#Love) - నెట్‌ఫ్లిక్స్

కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ '#లవ్' నెట్‌ఫ్లిక్‌ లో అలరిస్తోంది. డేటింగ్ యాప్‌లైన 'ఫౌండ్', 'ఫైండ్ మై బే'లకు అధిపతులుగా ఉండే తారా (ఐశ్వర్య లక్ష్మి), మాథ్యూ (అర్జున్ దాస్) మధ్య సాగే వృత్తిపరమైన పోటీ, ఆధునిక సంబంధాలపై వారి అభిప్రాయాలను ఎలా సవాలు చేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుంది.

నేటితరం ప్రేమ సంబంధాలను విశ్లేషిస్తూ బాలాజీ మోహన్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా దీనిని రూపొందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ వంటి 6 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో #లవ్ స్ట్రీమింగ్ అవుతోంది.

డూయింగ్ లైఫ్ (Doing Life) - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ రిలీజ్ అయిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'డూయింగ్ లైఫ్' ఒక ఒంటరి తల్లి జీవన పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. జైలు అధికారిణిగా పనిచేసే సమయంలో జరిగిన దాడుల నుంచి కాపాడిన ఒక మాజీ ఖైదీ కారౌసెల్ (జే రీవ్స్), అనిక (నెఓమి బేకర్) మధ్య ఏర్పడే వినూత్న బంధం ఈ సినిమా ఇతివృత్తం. ఇది కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.

ఈవిల్ డెడ్ బర్న్ (Evil Dead Burn) - జీ5

'ఈవిల్ డెడ్ బర్న్' హర్రర్ ప్రియులను భయపెట్టేందుకు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. సెబాస్టియన్ వానిచెక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో, కారు ప్రమాదంలో భర్త విల్ హఠాన్మరణం చెందిన తర్వాత అలిస్ అనే మహిళ తన అత్తవారింటికి వెళుతుంది.

అక్కడ తాతయ్య పరిశోధనలకు సంబంధించిన 'నెక్రోనామికన్' పుస్తకాన్ని యాదృచ్ఛికంగా తెరవడంతో రక్తపిశాచాలు విరుచుకుపడతాయి. భయంకరమైన ఈ విపత్తు నుంచి అలిస్ ఎలా ప్రాణాలు దక్కించుకుందనేది మిగతా కథ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వీకెండ్‌కు బెస్ట్

ఇలా ఇవాళ ఓటీటీ రిలీజైన ది బెస్ట్ 5 ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒక్క పూజా మేరీ జాన్ తప్పా మిగతా 4 తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్‌లో ఇటు థ్రిల్లర్లు, అటు రొమాంటిక్ వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఐదు చిత్రాలు, సిరీస్‌లు మంచి ఆప్షన్ అనుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More