OTT Today: ఓటీటీలో ఇవాళ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 6 సినిమాలు- ఒకేదాంట్లో 4, తెలుగులో 4- థ్రిల్లర్స్ టు ఫ్యామిలీ కామెడీ!

Top 6 OTT Release Movies Today October 1st: అక్టోబర్ 1న ఓటీటీల్లో టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకేదాంట్లో 4 ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. తెలుగులో 4 రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Oct 1, 2026, 12:50:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Top 6 OTT Release Movies Today October 1st: అక్టోబర్ ఆరంభంలోనే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌లలో సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో విభిన్న జోనర్లకు చెందిన బెస్ట్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. మరి ఆ టాప్ 6 ఓటీటీ సినిమాలు ఏంటో ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో సహా తెలుసుకుందాం.

ఓటీటీలో ఇవాళ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 6 సినిమాలు- ఒకేదాంట్లో 4, తెలుగులో 4- థ్రిల్లర్స్ టు ఫ్యామిలీ కామెడీ!
ఓటీటీలో ఇవాళ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 6 సినిమాలు- ఒకేదాంట్లో 4, తెలుగులో 4- థ్రిల్లర్స్ టు ఫ్యామిలీ కామెడీ!

1. సర్దార్ 2 (Sardar 2) - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

IMDb రేటింగ్: 6.2 / 10

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

తమిళ స్టార్ హీరో కార్తి కథానాయకుడిగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. 'డోకు' అనే ప్రమాదకరమైన బయోకెమికల్ ఆయుధాన్ని ప్రయోగించాలనుకునే అంతర్జాతీయ ముఠా కుట్రను అడ్డుకోవడానికి మాజీ అధికారి చంద్రబోస్, ఆయన కుమారుడు విజయ్ ప్రకాష్ చేసే సాహసపేతమైన పోరాటమే ఈ సినిమా.

గతంలో 3,000 మంది ప్రాణాలను బలితీసుకున్న ఒక విషాద ఘటన నేపథ్యంలో రూపొందిన ఈ కథలో.. మాజీ ఏజెంట్లు దాచిన మూడు యాక్సెస్ కీలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగుతాయి. యాక్షన్ థ్రిల్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ విపరీత వాడకం వల్ల కలిగే ముప్పుపై ఈ చిత్రం సందేశాన్ని ఇస్తుంది.

2. చుంబక్ సీజన్ 1 పార్ట్ 2 (Chumbak S1 Part 2) - తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్

IMDb రేటింగ్: 6.4 / 10

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ముంబైలోని 'చుంబక్ కాలనీ' రో-హౌస్ కమ్యూనిటీలోని ఐదు కుటుంబాల మధ్య సాగే సరదా గందరగోళం, రహస్యాలు, అనుబంధాల కలబోతగా ఈ డ్రామా తెరకెక్కింది. మొదటి భాగంలో నిలిచిపోయిన మలుపుల నుంచి ఈ రెండో భాగం కొనసాగుతుంది. పొరుగువారి మధ్య ఉండే స్నేహం, చిన్న చిన్న పొరపాట్లు, కుటుంబ డ్రామాను ఎంతో ఆహ్లాదకరంగా మలిచారు.

3. రోమాంచకం (Romanchakam) - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

IMDb రేటింగ్: 6.7 / 10

ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

యూత్‌ను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'రోమాంచకం'. సొంతంగా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ సాధించాలనే పట్టుదలతో అన్వేష్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక డేటింగ్ యాప్‌ను రూపొందిస్తాడు. విచిత్రమేమిటంటే.. వేలాది మందికి ప్రేమ దారి చూపే అతడు, తాను ప్రేమించిన అమ్మాయి మనసును మాత్రం గెలుచుకోలేకపోతాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, స్టార్టప్ సంక్షోభంలో పడటంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారు.

4. దుపహియా సీజన్ 2 (Duphahiya Season 2) - హిందీ

IMDb రేటింగ్: 7.4 / 10

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

గ్రామీణ నేపథ్యంతో సాగే కామెడీ ఓటీటీ సిరీస్ 'దుపహియా' రెండో సీజన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. బన్వారీకి చెందిన ఒక భూమిలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని చూడటంతో గ్రామంలోని ప్రజలంతా దానికి విచిత్రంగా స్పందిస్తారు. ఊరిలో జరిగే ప్రతీ విపత్తుకు ఆ టవరే కారణమని నిందిస్తారు. మరోవైపు భూగోల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఎదగడం, రోష్ని ఎస్ఎస్‌‌సి పరీక్ష ప్రిపరేషన్, మిథిలేష్ అనుమానం చుట్టూ కథ హంగామాగా సాగుతుంది.

5. ఓ మై డాగ్ (Ohh My Dog) - హిందీ

IMDb రేటింగ్: 8.0 / 10

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో అమిత్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ చిత్రం 'ఓ మై డాగ్'. ఒక చిన్నారి వీధి కుక్కతో ఏర్పరచుకున్న ప్రత్యేకమైన అనుబంధం, ఆ ఆత్మీయ ప్రయాణం వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను ఈ సినిమాలో ఆవిష్కరించారు. జంతువులు, మానవుల మధ్య ఉండే ప్రేమ ఏ విధంగా మనసు గాయాలను మాన్పుతుందో సందేశాత్మకంగా చూపించారు. పవన్ మల్హోత్రా, గీతా అగర్వాల్ శర్మ కూడా ముఖ్య పాత్రల్లో మెరిశారు.

6. ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (East Of Eden) - తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

జాన్ స్టెయిన్‌బెక్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఏడు భాగాల సిరీస్‌గా రూపొందిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్ 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్'. ఫ్లోరెన్స్ ప్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ ట్రాస్క్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తోబుట్టువుల మధ్య వైరం, వ్యక్తిగత స్వేచ్ఛ, తరతరాలుగా వస్తున్న మానసిక సంఘర్షణల చుట్టూ కథ సాగుతుంది. మైక్ ఫేస్ట్, క్రిస్టోఫర్ అబాట్ కీలక పాత్రలు పోషించారు.

ఒకేదాంట్లో 4, తెలుగులో 4

మంచి కథాంశాలు, అధిక ఐఎమ్‌డీబీ రేటింగ్‌లు ఉన్న ఈ టాప్ 6 చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో వీక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. అయితే, వీటిలో నాలుగు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, తెలుగు భాషలో కూడా 4 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మీ అభిరుచికి తగ్గట్టు భాషలు, రేటింగ్‌లను బట్టి ఈ చిత్రాలను ఓటీటీలో ఆస్వాదించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More