OTT Telugu: 2 ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్- మనుషులపై భారీ సర్పం, రాక్షస జీవుల వేట- యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు- తెలుగులోనే!
Snake 5 Monster City OTT Streaming For Free: భయంకరమైన ప్రాచీన భారీ సర్పం, రాక్షస జీవుల సాగించే వేట కథతో తెరకెక్కిన హారర్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఓటీటీల్లో అలరిస్తోంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న స్నేక్ 5 మూవీని ఫ్రీగా యూట్యూబ్‌లో చూడొచ్చు.
Snake 5 Monster City OTT Release Free: హారర్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. భయంకరమైన ప్రాచీన భారీ సర్పం, రాక్షస జీవులు మనుషులపై సాగించే వేట నేపథ్యంలో ఓ సినిమా 2 ఓటీటీల్లో అడుగుపెట్టింది.

హారర్ ఫాంటసీ సర్వైవల్ థ్రిల్లర్
ఆ సినిమానే 'స్నేక్ 5: మాన్‌స్టర్ సిటీ' (Snake 5: Monster City). చైనీస్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది.
పసిఫిక్ దీవిలో రాకాసి జీవుల వేట
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 'నాంగా సిటీ' అనే ఒక చిన్న ద్వీపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊహించని విధంగా ఆ నగరంపై ప్రాచీన కాలపు భయంకరమైన భారీ సర్పం, ఇతర పాములు, గాల్లో ఎగురుతూ వచ్చే ఫిరానా వంటి చేపలు, వింతైన రాక్షస జీవులు ఒక్కసారిగా విరుచుకుపడతాయి.
జనాలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంటే, నగరం మొత్తం శవాల దిబ్బగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో స్థానిక జైలుపై దాడి జరగడంతో 'వూ చువాన్' అనే ఖైదీ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అయితే బయటకు వచ్చిన అతనికి నగరం మొత్తం మనుషులను వేటాడే రాకాసి జీవుల స్థావరంగా మారినట్లు తెలుస్తుంది.
తల్లి కోసం రాకాసి జీవులతో ఖైదీ పోరాటం
నగరంలో ఒక రసాయన కర్మాగారం (కెమికల్ ప్లాంట్) లో చిక్కుకుపోయిన తన తల్లిని కాపాడుకోవడమే ధ్యేయంగా వూ చువాన్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఈ ప్రాణాంతక ప్రయాణంలో అతనిలోని మానవత్వం మేల్కొంటుంది. కేవలం తన తల్లిని మాత్రమే కాకుండా, నగరంలో ప్రాణాలతో ఉన్న మిగతా వారిని కూడా కాపాడే బాధ్యతను భుజాన వేసుకుంటాడు.
నగర నాశనానికి కంకణం కట్టుకున్న అతిపెద్ద ప్రాచీన సర్పం (అనకొండ లాంటిది) 'పాంగు కింగ్ సెర్పెంట్' ను వూ చువాన్ తన బృందంతో కలిసి ఎలా అంతం చేశాడు? ఈ నరకం నుంచి ఎలా బయటపడ్డాడు? అనే అంశాలను చివరి వరకు ఉత్కంఠభరితంగా చూపించారు దర్శకుడు.
స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్
దాదాపు 107 నిమిషాల నిడివితో సాగే ఈ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ సినిమాకు లిన్ జెన్‌జో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జంగ్ ఆయోయె, లియాంగ్ సోంగ్‌చింగ్, బావో బీయర్, క్సింగ్ యు వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఒళ్లు గగుర్పొడిచే గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీని 2 ఓటీటీల్లో చూసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లో స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా తెలుగులో ఉన్నప్పటికీ అద్దె విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది.
లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో కూడా
ఇదే కాకుండా లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో అద్దె వంటి విధానం లేదు. కానీ, సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నవాళ్లు మాత్రమే చూసేలా తెలుగు భాషలోనే స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.
ఈ రెండు పక్కన పెడితే ఎలాంటి చెల్లింపులు లేకుండా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ సినిమాను చూసేయొచ్చు. యూట్యూబ్‌లో స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ ఫ్రీగా అందుబాటులో ఉంది. అది కూడా తెలుగు భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


