OTT: 2 కోట్ల బడ్జెట్, 100 కోట్ల కలెక్షన్స్- ఓటీటీ సంస్థ రెజెక్ట్ చేసి, నీచంగా అవమానించిన సినిమా సాధించిన రికార్డ్ ఇది!
OTT Rejected 100 Cr Collection Movie Hanuman Ansh: రూ. 2 కోట్లతో తీసి రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హనుమాన్ అంశ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టిస్తోంది. ఈ సినిమా కథను మొదట్లో ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ తిరస్కరించి, తనను తీవ్రంగా అవమానించిన సంఘటనను దర్శకుడు విశాల్ చతుర్వేది బయటపెట్టారు.
OTT Rejected 100 Cr Collection Movie Hanuman Ansh: బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ సినిమా అద్భుతాలు చేస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎలాంటి ఆర్బాటం, ప్రచారం లేకుండా థియేటర్లలోకి వచ్చి, కేవలం ప్రేక్షకుల ఆదరణతో సుమారు రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) చిత్రం.

ఆధ్యాత్మిక నేపథ్యంలో
భారతీయ ఆధ్యాత్మికత నేపథ్యంలో వచ్చిన హనుమాన్ అంశ్ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ అపూర్వ విజయం వెనుక దర్శకుడు విశాల్ చతుర్వేది ఎదుర్కొన్న అవమానాలు, ఎదురుదెబ్బలు తక్కువవేమీ కావట.
ఒకప్పుడు తన కథను తీవ్రంగా హేళన చేసిన ఓటీటీ సంస్థలకు ఇప్పుడు ఈ హనుమాన్ అంశ్ సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్లే గట్టి సమాధానం చెబుతున్నాయి. హనుమాన్ అంశ్ సినిమా విడుదలైన కొత్తలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ గుర్తుచేసుకున్నారు.
ఓటీటీ సంస్థ చేసిన అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు!
"నేను నా కథను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు వినిపించడానికి వెళ్లాను. మహారాజ్ జీ (నీమ్ కరోలీ బాబా) జీవిత విశేషాలను వివరిస్తూ నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే అవకాశం ఉన్న భారతీయ కథ ఇది అని వాళ్లకు చెప్పాను" అని దర్శకుడు విశాల్ చతుర్వేది వివరించారు.
అయితే సదరు ఓటీటీ సంస్థ ప్రతినిధులు ఈ సినిమా కథను తిరస్కరించడమే కాకుండా, చాలా నీచమైన రీతిలో మాట్లాడారని డైరెక్టర్ విశాల్ చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో తిరస్కరణలు సహజమని, కానీ దానికి వాడిన భాష తమను తీవ్రంగా గాయపరిచిందని ఆయన మండిపడ్డారు.
బాక్సాఫీస్ వద్ద అద్భుత మలుపు..
వారి మనసుల్లో ఉన్న సంకుచిత భావజాలాన్ని బద్దలు కొట్టాలనే పట్టుదలతోనే ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ అంశ్ సినిమా ప్రయాణం మొదట్లో అంత సులువుగా సాగలేదు.
తొలిరోజు కేవలం రూ. 10 లక్షల నెట్ కలెక్షన్లతో అత్యంత నిరాడంబరంగా ప్రారంభమైంది. మొదటి వారంలో రూ. 1.80 కోట్లు, రెండో వారంలో కేవలం రూ. 40 లక్షలు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమా థియేటర్ల నుంచి త్వరలోనే నిష్క్రమిస్తుందని అంతా భావించారు.
నోటి మాటతో పెరిగిన కలెక్షన్స్
అయితే మూడో వారం నుంచి ప్రేక్షకుల నోటి మాట (Word of Mouth) ద్వారా వచ్చిన ప్రచారంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు కలకలలాడాయి. మూడో వారంలో ఏకంగా రూ. 10.40 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, నాలుగో వారంలో రికార్డు స్థాయిలో రూ. 61 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
అంతేకాకుండా హనుమాన్ అంశ్ విడుదలైన 29వ రోజు కూడా రూ. 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సినిమా సత్తా ఏంటో చూపించింది. 29వ రోజున 47 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ సాధించిందని సమాచారం. ఇక మొత్తంగా 29 రోజుల్లో ఇండియాలో హనుమాన్ అంశ్ సినిమా రూ. 82.88 కోట్ల నెట్, రూ. 97.99 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
2 కోట్ల బడ్జెట్, 100 కోట్ల కలెక్షన్స్
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ సినిమా రూ. 100 కోట్ల కలెక్షన్స్‌కు చాలా దగ్గరిగా ఉంది. ఇంకా ఒక్కరోజు గడిస్తే వంద కోట్ల క్లబ్‌లో సునాయాసంగా పడిపోతుంది. 2 కోట్లతో తెరకెక్కిన 100 కోట్లు రాబట్టిన ఈ హనుమాన్ అంశ్ సినిమాను ఓటీటీ సంస్థ రెజెక్ట్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
నీమ్ కరోలీ బాబా జీవిత కథతో..
ఇదిలా ఉంటే, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలు, ఆయన బోధనల ఆధారంగా ఈ భక్తిరస డ్రామా రూపుదిద్దుకుంది. డాక్టర్ విశాల్ చతుర్వేది ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించడంతో పాటు కథను కూడా అందించారు.
శోభినావ్ సత్య ఈ సినిమాలో కథానాయకుడిగా లీడ్ రోల్ పోషించారు. విశ్వాసం, కథలోని బలం ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో ఈ చిత్రం మరొకసారి రుజువు చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


