Don't Be Shy OTT: నిర్మాతగా హీరోయిన్- ప్రేమకథ, గుండెకోత కథతో అలియా భట్ డోంట్ బీ షై ట్రైలర్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Don't Be Shy Trailer Released And OTT Streaming: స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న 'డోంట్ బీ షై' మూవీ ట్రైలర్‌ను ఓటీటీ సంస్థ విడుదల చేసింది. టీనేజ్ లవ్, క్యాంపస్ లైఫ్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం డోంట్ బీ షై ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.
Don't Be Shy Trailer Released And OTT Streaming: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్, నిర్మాతగానూ వరుస వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' పతాకంపై రూపుదిద్దుకున్న నూతన చిత్రం 'డోంట్ బీ షై' (Don’t Be Shy) ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ శుక్రవారం (సెప్టెంబర్ 11) విడుదల చేసింది.

ఆకట్టుకుంటున్న ట్రైలర్..
టీనేజ్ డ్రామా, క్యాంపస్ రొమాన్స్ కలగలిపిన కథాంశంతో ఈ ఓటీటీ సినిమా రూపుదిద్దుకుంది. సుమారు 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న ఈ డోంట్ బీ షై ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
అసలు కథేంటంటే?
శ్యామిలీ అలియాస్ 'షై' దాస్ (ఆరుషి బజాజ్) అనే కళాశాల విద్యార్థిని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ప్రతీ విషయాన్ని ముందే ప్రణాళిక వేసుకునే షై ఆశలు ఉన్నట్టుండి తలకిందులవుతాయి. ఈ క్రమంలో ఆమె కళాశాలలో ధనవంతుడు, అందరి దృష్టిని ఆకర్షించే మయాంక్ (పీయూష్ ఖాటి) వైపు ఆకర్షితురాలవుతుంది.
సరిగ్గా అదే సమయంలో దూరమైన చిన్ననాటి మిత్రుడు ధ్రువ్ (అన్ష్ దుగ్గల్) మళ్లీ షై జీవితంలోకి వస్తాడు. వీరిద్దరి మధ్య నలిగిపోయే షై జీవితంలోకి తార (బియాంకా అరోరా) రాకతో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
"తొలి ప్రేమ.. తప్పు నిర్ణయాల సమాహారమే ఈ సినిమా"
డోంట్ బీ షై సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అలియా భట్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "తొలి ప్రేమ, బెస్ట్ ఫ్రెండ్స్, గుండెకోతలు, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు.. ఇవన్నీ కలిపితేనే యుక్తవయసులోకి అడుగుపెట్టే ఆ మధుర జ్ఞాపకాలు" అని అలియా భట్ పేర్కొన్నారు.
దర్శకురాలు శ్రీతి ముఖర్జీ మాట్లాడుతూ.. "చిన్నతనంలో నన్ను ఎంతగానో అలరించిన, ఓదార్పునిచ్చిన సినిమాలను గుర్తుచేసుకుంటూ ఈ కథను రాసుకున్నాను. యుక్తవయసులో అడుగుపెట్టే వేళ ప్రతీ ఒక్కరి జీవితంలో ఎదురయ్యే గందరగోళం, అమాయకత్వం, మళ్లీ మనల్ని మనం వెతుక్కునే ప్రయాణమే ఈ చిత్రం" అని తెలిపారు.
సరికొత్త నటీనటులు.. సీనియర్ల కలయిక
హీరోయిన్‌గా నటించిన ఆరుషి బజాజ్ తన పాత్రపై స్పందిస్తూ.. "నా నిజ జీవిత స్వభావానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ చేయడం నాకు సవాలుగా అనిపించినా, నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి దోహదపడింది" అని చెప్పారు.
డోంట్ బీ షై సినిమాలో ఆరుషి బజాజ్, పీయూష్ ఖాటి, బియాంకా అరోరా, అన్ష్ దుగ్గల్ వంటి నూతన నటీనటులతో పాటు కుణాల్ రాయ్ కపూర్, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బాసు, నేహా ధూపియా, అంజు ఆల్వా నాయక్ కీలక పాత్రల్లో నటించారు.
డోంట్ బీ షై ఓటీటీ స్ట్రీమింగ్
శ్రీతి ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలియా భట్, షాహీన్ భట్ నిర్మించగా, గ్రీష్మా షా, వికేష్ భూతానీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. నేటి తరం యువత భావోద్వేగాలను, క్యాంపస్ లైఫ్‌ను ప్రతిబింబించేలా ఉన్న డోంట్ బీ షై ఓటీటీలోకి వచ్చేయనుంది. సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డోంట్ బీ షై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


