Ritika Nayak: సినిమాలో కొరియన్.. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లోనూ కొరియ‌న్‌.. ఆ స్టార్‌పై మ‌న‌సు పారేసుకున్న రితికా నాయ‌క్‌

Ritika Nayak: టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా మారిన యంగ్ హీరోయిన్ రితికా నాయక్ ఇప్పుడో సెన్సేషన్. తాజాగా కొరియన్ కనకరాజు మూవీతో ఆమె హ్యాట్రిక్ కొట్టింది. సినిమాలో కొరియన్ పేరు ఉండటమే కాదు రితికా రియల్ లైఫ్ లోనూ కొరియన్ కనెక్షన్ ఉంది. ఓ స్టార్ పై ఆమె మనసు పారేసుకుంది. అతనెవరో చూసేయండి.

Published on: Aug 13, 2026, 11:29:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ritika Nayak: ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ముద్దుగుమ్మ రితికా నాయక్ హ్యాట్రిక్ జోష్ లో ఉంది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రితికా, తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, మొబైల్ సీక్రెట్స్, సౌత్ కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బిటిఎస్ (BTS) బ్యాండ్ స్టార్ 'సుగా' (SUGA) పై తనకున్న అమితమైన అభిమానాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.

సినిమాలో కొరియన్.. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లోనూ కొరియ‌న్‌.. ఆ స్టార్‌పై మ‌న‌సు పారేసుకున్న రితికా నాయ‌క్‌ (instagram)
సినిమాలో కొరియన్.. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లోనూ కొరియ‌న్‌.. ఆ స్టార్‌పై మ‌న‌సు పారేసుకున్న రితికా నాయ‌క్‌ (instagram)

సుగా నా ఫేవరెట్

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో యాంకర్ రితికా నాయక్ ను.. "మీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఎవరి ఫోటో ఉంది?" అని ప్రశ్నించారు. దానికి రితికా ఏమాత్రం తడుముకోకుండా తన స్మార్ట్‌ఫోన్ తీసి స్క్రీన్ చూపించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధ సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బిటిఎస్ (BTS - Bangtan Sonyeondan) ఫోటో ఉంది.

బిటిఎస్ సభ్యులలో మీకు ఎవరంటే ఇష్టమంటే.. వెంటనే సుగా పేరు చెప్పేసింది రితికా నాయక్.

చూస్తూ ఉండిపోతా

"ఒకవేళ సుగాను నేరుగా కలిసే అవకాశం వస్తే నేను ఏమీ మాట్లాడలేను. అలా అతని వైపే చూస్తూ ఉండిపోతాను. 'హాయ్.. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ' అని మాత్రమే చెప్పగలనేమో" అని తన క్రష్ గురించి నవ్వుతూ చెప్పుకొచ్చింది రితికా.

ఆ బాధ

బిటిఎస్ వరల్డ్ టూర్ లిస్టులో ఇండియా లేకపోవడం తనను ఎంతో బాధించిందని రితికా నాయక్ వెల్లడించింది. అయితే భవిష్యత్తులో తప్పకుండా వారు భారతదేశానికి వచ్చి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

క్రేజీ కనెక్షన్

యాదృచ్ఛికంగా రితికా నాయక్ ఇటీవల నటించిన సినిమా పేరు 'కొరియన్ కనకరాజు' కావడం, రియల్ లైఫ్‌లో కూడా ఆమెకు కొరియన్ పాప్ కల్చర్, బిటిఎస్ మ్యూజిక్ అంటే అమితమైన ఇష్టం ఉండటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను (BTS ARMY) కలిగి ఉన్న ఈ 7-సభ్యుల గ్రూప్ (ఆర్ఎమ్, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్) కు భారతదేశంలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా తాను బిటిఎస్ ఆర్మీలో ఒకరినని బహిరంగంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో రితికా నాయక్ జోరు

2022లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రితికా నాయక్, తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మిరాయ్’ (Mirai) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పి బిగ్ బ్రేక్ అందించింది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ, ఇటీవల టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) చిత్రంలో కథానాయికగా అలరించింది. ఆగస్టు 7న విడుదలైన ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకోవడంతో రితికా గోల్డెన్ లెగ్ గా మారింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More