Nithiin: ఫ్లాప్‌లకు బ్రేక్ పడేనా? నితిన్ కొత్త సినిమా షురూ.. మిరాయ్ బ్యూటీతో రొమాన్స్.. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్
Nithiin: వరుస ఫ్లాప్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నితిన్ మరో సినిమాను మొదలెట్టాడు. ఇవాళ అతని కొత్త మూవీ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్.
Nithiin: వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లు.. సరైన బ్రేక్ కోసం అయిదేళ్లకు పైగా ఎదురు చూపులు.. ఇదీ ఇప్పుడు హీరో నితిన్ పరిస్థితి. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమా షురూ చేశాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతోనైనా తన లక్ మారుతుందేమో చూడాలి.

నితిన్ కొత్త సినిమా
ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు నితిన్. వరుసగా హిట్లు అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా డిజాస్టర్లే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్లతో, మిరాయ్ బ్యూటీతో కలిసి నితిన్ కొత్త మూవీ మొదలెట్టాడు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఈ రోజు జరిగింది.
మిరాయ్ బ్యూటీ
నితిన్ కొత్త సినిమాలో మిరాయ్ తో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే నర్రి, సోము అనే యువకులు డైరెక్టర్లుగా మారుతున్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 43వ సినిమా ఇది. నితిన్ కెరీర్ లో 34వ మూవీ. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారం నుంచి జరుగుతుందని మేకర్స్ తెలిపారు.
వరుస ఫ్లాప్ లతో
హీరో నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు. 2020లో వచ్చిన ‘భీష్మ’ తర్వాత నితిన్ కు మరో హిట్ దక్కలేదు. చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ముఖ్యంగా నితిన్ లాస్ట్ మూవీ తమ్ముడు అయితే డిజాస్టర్ గా నిలిచింది.
తమ్ముడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న నితిన్ ఇప్పుడు డెబ్యూ డైరెెక్టర్లతో చేస్తున్న మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. భీష్మ, రంగ్ దే తర్వాత నాగవంశీ- నితిన్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ ఇది.
గోల్డెన్ లెగ్
మరోవైపు హీరోయిన్ రితికా నాయక్ కు గోల్డెన్ లెగ్ అనే పేరొచ్చింది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీతో డెబ్యూ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హాయ్ నాన్నలో మెరిసింది. అనంతరం మిరాయ్ లో అదరగొట్టింది. మిరాయ్ లో అందం, నటనతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.
ఇప్పుడు నితిన్ పక్కన సినిమాలో రితికా నాయక్ ఛాన్స్ కొట్టేసింది. ఈ భామ ఖాతాలో మరో మూడు సినిమాలున్నాయని టాక్. మరి బ్యూటీ రితికా రాకతోనైనా నితిన్ జాతకం మారుతుందేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


