Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. 2 కోట్ల బడ్జెట్.. 400 కోట్ల కలెక్షన్లు.. 9 వారాలైనా తగ్గని జోరు!

Hanuman Ansh OTT: ఇండియన్ సినీ హిస్టరీలోనే హనుమాన్ అంశ్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ వైరల్ గా మారింది. 

Published on: Oct 5, 2026, 10:38:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hanuman Ansh OTT: ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డివోషనల్ ఎంటర్‌టైనర్ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అపూర్వమైన రికార్డులను సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల నామమాత్రపు బడ్జెట్‌‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

2 కోట్ల బడ్జెట్.. 400 కోట్ల కలెక్షన్లు.. హనుమాన్ అంశ్ ఓటీటీలోకి ఎప్పుడు? 9 వారాలైనా తగ్గని స్పీడ్ (x/hombalefilms)
2 కోట్ల బడ్జెట్.. 400 కోట్ల కలెక్షన్లు.. హనుమాన్ అంశ్ ఓటీటీలోకి ఎప్పుడు? 9 వారాలైనా తగ్గని స్పీడ్ (x/hombalefilms)

రూ.400 కోట్ల కలెక్షన్ల సునామీ

తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో 'హనుమాన్ అంశ్' అగ్రస్థానంలో నిలిచింది. నీమ్ కరోలీ బాబా మహత్యం, ఆధ్యాత్మిక అంశాలు, భావోద్వేగాల సమ్మేళనంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

9 వారాలైనా

సాధారణంగా చిన్న చిత్రాలు రెండు లేదా మూడు వారాల్లో థియేట్రికల్ రన్‌ను ముగిస్తుంటాయి. కానీ హనుమాన్ అంశ్ చిత్రం తొమ్మిదో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రికార్డు వసూళ్లు ఖాతాలో వేసుకుంటోంది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హనుమాన్ అంశ్ చిత్రంలో శోభినావ్ సత్య హీరోగా నటించాడు. చందన్ ఆనంద్, నిఖిల్ దూబే, ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్, పూర్ణిమ తివారి కీలక పాత్రల్లో మెరిసారు.

తెలుగులో గ్రాండ్ రిలీజ్

హనుమాన్ అంశ్ సినిమాకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ వచ్చే శుక్రవారం (అక్టోబర్ 9) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ పై బజ్ వైరల్ గా మారింది.

ఓటీటీలోకి ఎప్పుడు?

సాధారణంగా హిందీ సినిమాలు ఎనిమిది వారాల విండో ముగిసిన వెంటనే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'హనుమాన్ అంశ్' విషయంలో మేకర్స్ ఆ నిబంధనను పక్కనబెట్టారు. థియేటర్లలో ఇంకా కలెక్షన్ల వర్షం కురుస్తుండటంతో పాటు, తెలుగు విడుదల కూడా ఉండటంతో ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలిసింది.

ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో హనుమాన్ అంశ్ కోసం భారీ ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది. అయినా కూడా థియేట్రికల్ రన్ ముగిసే వరకు స్ట్రీమింగ్ తేదీపై తుది నిర్ణయం తీసుకోకూడదని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. అంటే తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. తెలుగులో రెస్పాన్స్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More