The Paradise Collections: ది ప్యారడైజ్ కలెక్షన్లు.. అఫీషియల్ లెక్కలు ప్రకటించిన ప్రొడ్యూసర్లు.. రెండు రోజుల్లో ఎంతంటే?

The Paradise Collections: జడల్ జమానా థియేటర్లకు షేక్ చేస్తోంది. నెగెటివ్ వచ్చినప్పటికీ ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ లెక్కలు తిరగరాస్తోంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్లను ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి మూవీ వసూళ్లు ఎన్ని కోట్లో ఓ లుక్కేయండి. 

Published on: Sep 26, 2026, 13:36:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తోంది. గురువారం (సెప్టెంబర్ 24) రిలీజైన ది ప్యారడైజ్ మూవీకి ఎక్కువగా నెగెటివ్ టాక్ వినిపించింది. అయినా ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఏ మాత్రం పడటం లేదు.

ది ప్యారడైజ్ కలెక్షన్లు.. అఫీషియల్ లెక్కలు ప్రకటించిన ప్రొడ్యూసర్లు.. రెండు రోజుల్లో ఎంతంటే? (x/SLVCinemasOffl)
ది ప్యారడైజ్ కలెక్షన్లు.. అఫీషియల్ లెక్కలు ప్రకటించిన ప్రొడ్యూసర్లు.. రెండు రోజుల్లో ఎంతంటే? (x/SLVCinemasOffl)

ది ప్యారడైజ్ కలెక్షన్లు

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 24న రిలీజైన ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లను ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ఎస్ఎల్వీ సినిమాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

రూ.100 కోట్ల క్లబ్

ది ప్యారడైజ్ మూవీ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ప్రొడ్యూసర్లు ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ సాధించిందని చెప్పారు. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశముంది.

నెగెటివ్ టాక్

ది ప్యారడైజ్ మూవీకి ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో రక్తపాతం తప్పా కథలో ఎమోషనల్ డెప్త్ మిస్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. ది ప్యారడైజ్ కంటే టాక్సిక్ బెటర్ అని కూడా కొందరు తీవ్రమైన పోస్టులు పెట్టారు. అయితే ట్రైలర్ లేకుండానే రిలీజైన ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ ను మాత్రం రూల్ చేస్తోంది.

2.5 మిలియన్ టికెట్లు

నాని సినిమా క్రేజ్ మామూలుగా లేదు. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. కేవలం బుక్ మై షో, డిస్ట్రిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే 2.5 మిలియన్ (25 లక్షలు) టికెట్లు అమ్ముడయ్యాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు.

ది ప్యారడైజ్ గురించి

ది ప్యారడైజ్ సినిమాలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇది తమ గుర్తింపు కోసం పోరాడే సవారీల తెగ కథ. శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం ఈ సవారీలను హీనంగా చూస్తూ పెత్తనం చలాయిస్తుంటుంది. అప్పుడే జడల్ (నాని) పుడతాడు. తన జాతి గుర్తింపు కోసం అతను పోరాడతాడు.

మరి జడల్ అసలు కథ ఏంటీ? అతను ఆ పేరు ఎందుకు వచ్చింది? సవారీలకు గుర్తింపు దక్కిందా లేదా? అనేది ది ప్యారడైజ్ మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More