The Paradise OTT: ఈ ఓటీటీలోకే ది ప్యారడైజ్ మూవీ.. నాని సినిమా స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌.. ఎప్పటి నుంచంటే?

The Paradise OTT: ఇప్పుడు సినీ లవర్స్ అంతా ది ప్యారడైజ్ గురించే సెర్చ్ చేస్తున్నారు. మూవీ రివ్యూతో పాటు కలెక్షన్లు, అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ గురించి ఇక్కడ చూసేయండి.

Published on: Sep 24, 2026, 10:29:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise OTT: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన 'ది ప్యాారడైజ్' (The Paradise) నేడు (సెప్టెంబర్ 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ ఓపెనింగ్స్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ ను మేకర్స్ ప్రకటించేశారు.

ఈ ఓటీటీలోకే ది ప్యారడైజ్ మూవీ.. నాని సినిమా స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌.. ఎప్పటి నుంచంటే? (x/TheParadiseOffl)
ఈ ఓటీటీలోకే ది ప్యారడైజ్ మూవీ.. నాని సినిమా స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌.. ఎప్పటి నుంచంటే? (x/TheParadiseOffl)

ది ప్యారడైజ్ ఓటీటీ

థియేటర్లలో 'ది ప్యారడైజ్' బిగ్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్న వేళ, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌పై మేకర్స్ ఊహించిన ప్రకటన చేశారు. పాన్-ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వచ్చిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ బిగ్గీ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ఆడియన్స్‌ను రీచ్ అయ్యేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎస్‌ఎల్‌వి సినిమాస్‌కి భారీ ఆఫర్ ఇచ్చి ఈ హక్కులను దక్కించుకుంది.

స్ట్రీమింగ్ ఎప్పుడు?

నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ డీల్, రిలీజ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రావడంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నదే ప్రశ్న. ది ప్యారడైజ్ మూవీని నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ డీల్ చేసుకుందని టాక్.

నాలుగు వారాలు అంటే దసరా సందర్భంగా అక్టోబర్ 20న ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుంది.

ట్విస్ట్ ఇదే

ది ప్యారడైజ్ మూవీ ఓటీటీ రైట్స్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుందని టాక్. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య టఫ్ ఫైట్ నడిచిందని సమాచారం. చివరకు గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీకి అదిరిపోయే రేట్ ఆఫర్ చేసిందని తెలిసింది.

ఆల్ టైమ్ రికార్డ్స్ గ్యారెంటీ

ది ప్యారడైజ్ మూవీ డే 1 ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అయిందని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. నాని కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగాయి. గతంలో 'హిట్ 3', 'దసరా' సినిమాల పేరిట ఉన్న ఫస్ట్ డే వసూళ్ల రికార్డులను 'ది ప్యారడైైజ్' ఈజీగా దాటేస్తుందని అంటున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More