Netflix Trending: నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో సౌత్ ఇండియా సినిమాల హవా-రెండు తమిళ్, ఓ తెలుగు మూవీ-లుక్కేయండి!
Netflix Trending: పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో సౌత్ ఇండియా సినిమాలు హవా కొనసాగుతోంది. లేటెస్ట్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ మూవీస్ లిస్ట్ లో మూడు సౌత్ ఇండియా చిత్రాలున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
Netflix Trending: సౌత్ ఇండస్ట్రీ సినిమాలు ఇటు బాక్సాఫీస్ ను శాసించడమే కాదు అటు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతూనే ఉన్నాయి. తాజాగా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లోనూ సౌత్ ఇండియా సినిమాల జోరు క్లియర్ గా కనిపిస్తోంది.

ట్రెండింగ్ లో మూడు సినిమాలు
పాపులర్ ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో సౌత్ ఇండియా సినిమాల డామినేన్స్ క్లియర్ గా తెలుస్తోంది. లేటెస్ట్ గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల టాప్ 10 లిస్ట్ లో రెండు తమిళ సినిమాలు, ఓ తెలుగు మూవీ ఉంది. అవే.. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మొద రాత్రి.
నెట్‌ఫ్లిక్స్ నంబర్ వన్
సూర్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ట్రెండింగ్ నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది. రెండు వారాలుగా ఆ మూవీ టాప్ లోనే ఉంది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇరుముడి జోరు
థియేటర్లలో అదరగొట్టిన రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ చిత్రానికి తిరుగులేదు. ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే ఈ సినిమా గ్లోబల్ ట్రెండింగ్ లో మూడో ప్లేస్ కు దూసుకెళ్లింది. రెండు రోజుల్లోనే ఈ మూవీకి నెట్‌ఫ్లిక్స్ లో 3.4 మిలియన్ వ్యూస్ దక్కాయి.
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి మూవీ థియేటర్లలో రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.
మొద రాత్రి
ఇక తమిళ రీసెంట్ సూపర్ హిట్ మూవీ మొద రాత్రి కూడా స్ట్రీమింగ్ లో వారెవా అనిపిస్తోంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ నాన్ ఇంగ్లీష్ టాప్ 10 లిస్ట్ లో ప్రస్తుం ఏడో ప్లేస్ లో ఉంది. ఈ సినిమాకు రెండు రోజుల్లో 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఫస్ట్ నైట్ రోజు తన భార్యను ఆమె లవర్ దగ్గరకు తీసుకెళ్లేందుకు ట్రై చేసే ఓ భర్త కథగా మొద రాత్రి మూవీ సాగుతుంది. కానీ ఆ లవర్ హ్యాండ్ ఇవ్వడంతో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


