OTT Trending: ఓటీటీలోనూ రికార్డు.. ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా ఇరుముడి.. బిగ్ స్క్రీన్లు పెట్టుకొని మరీ చూస్తున్న జనాలు

OTT Trending: థియేటర్లలో సెన్సేషనల్ విక్టరీ సాధించిన ఇరుముడి మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఓ వైపు కొంతమంది ఓవర్ రేటెడ్ అంటూ విమర్శిస్తున్నా.. స్ట్రీమింగ్ లో మాత్రం ఇరుముడి జోరు తగ్గడం లేదు. జనాలు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని మరీ ఈ సినిమాను చూస్తున్నారు. 

Published on: Sep 20, 2026, 16:40:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Trending: బ్లాక్ బస్టర్ మూవీ ఇరుముడి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు ఓటీటీలోనూ, అటు థియేటర్లలోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన ఇరుముడి సినిమా.. థియేటర్లకూ జనాలను రప్పిస్తోంది.

ఓటీటీలోనూ రికార్డు.. ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా ఇరుముడి.. బిగ్ స్క్రీన్లు పెట్టుకొని మరీ చూస్తున్న జనాలు (x)
ఓటీటీలోనూ రికార్డు.. ట్రెండింగ్ నంబ‌ర్‌వ‌న్‌గా ఇరుముడి.. బిగ్ స్క్రీన్లు పెట్టుకొని మరీ చూస్తున్న జనాలు (x)

ఇరుముడి ఓటీటీ

థియేటర్లలో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ ఇద్దరి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘ఇరుముడి’ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 18) ఈ చిత్రం ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇరుముడి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడీ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసుకు దూసుకెళ్లింది.

ఒక్క రోజులోనే

ఓటీటీలో ఇరుముడి హవా మామూలుగా లేదు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే ఇరుముడి ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. శనివారం రాత్రి వరకే ఈ సినిమా నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది. జనాలు ఈ మూవీని ఎంతలా ఎగబడి చూస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

అన్ని భాషల్లోనూ

ఇరుముడి సినిమాలోని తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం, గ్రామీణ వాతావరణంలో సాగే బలమైన భావోద్వేగాలు థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు రావడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆడియన్స్ ఈ మూవీని ఆదరిస్తున్నారు.

ఆ విమర్శలు

అయితే ఈ ఇరుముడి చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు దీనిపై నెగెటివ్ ప్రచారానికి తెరలేపారు. థియేట్రికల్ నంబర్లు ఫేక్ అని, సినిమాకు ఊరికే ఎక్కువ హైప్ ఇచ్చారని, ఇదొక ఓవర్‌రేటెడ్ మూవీ అని కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు. కానీ ఈ విమర్శలు, నెగెటివిటీని ఏమాత్రం లెక్కచేయకుండా 'ఇరుముడి' నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్ట్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

బిగ్ స్క్రీన్లు పెట్టుకొని

ఇరుముడి మూవీని జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని మరీ థియేటర్లలో ఆదరించారు. అందుకే ఈ మూవీ ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఈ మూవీపై ఆదరణ కురిపిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు గణేషుడి మంటపాలు, ఊర్లోని కూడళ్లు, ప్రధాన ఏరియాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ జనాలు ఇరుముడిని కలిసి చూస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More