Irumudi: రవితేజ ర్యాంపేజ్.. 9వ రోజూ ఇరుముడి జోరు.. గంటకు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న టికెట్లు!

Irumudi: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం రిలీజై 9 రోజులు అవుతున్నా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. గంటకు రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. వేల టికెట్లు అమ్ముడవుతూ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Published on: Aug 29, 2026, 16:04:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi: ఏం క్రేజ్.. ఏం జనాలు.. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్.. ఇప్పుడు రవితేజ సినిమా ఇరుముడి గురించి జనాలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. అవును.. ఇరుముడి మూవీ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇది. ఈ చిత్రం రిలీజై 9 రోజులు గడుస్తున్నా టికెట్ సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.

రవితేజ ర్యాంపేజ్.. 9వ రోజూ ఇరుముడి జోరు.. గంటకు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న టికెట్లు! (x/MythriOfficial)
రవితేజ ర్యాంపేజ్.. 9వ రోజూ ఇరుముడి జోరు.. గంటకు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న టికెట్లు! (x/MythriOfficial)

ఇరుముడి క్రేజ్

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చి తొమ్మిది రోజులు గడుస్తున్నా, మొదటి రోజు ఎంతటి క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయి ఉత్సాహం కనిపిస్తోంది. ఆడియన్స్ ఈ సినిమాకు జై కొడుతున్నారు.

ఇక మళ్లీ వీకెండ్ కావడంతో ఇరుముడి థియేటర్ల దగ్గర క్రేజ్ మరో లెవల్ కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్ల వద్ద రవితేజ అభిమానుల కోలాహలం నెలకొంది.

రికార్డు స్థాయి టికెట్లు

ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక 'బుక్‌ మై షో' (Book MyS how) లో ఈ ఇరుముడి సినిమా టికెట్ల కొనుగోలు జాతరలా సాగుతోంది. 9వ రోజున కూడా ఈ చిత్రానికి సంబంధించి గంటకు సగటున 24.52 వేల (24.52K) టికెట్లు విక్రయమవుతున్నాయి. ఈ విషయాన్ని ఇరుముడి నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అదిరేలా

సాధారణంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల బుకింగ్స్ తగ్గుముఖం పడుతుంటాయి. కానీ, 'ఇరుముడి' విషయంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రోజు రోజుకూ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

హౌస్‌ఫుల్ బోర్డులు

బి, సీ సెంటర్లతో పాటు ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో కూడా ఇరుముడి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కాంప్లెక్స్ లుగా మారుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు పుష్కలంగా ఉండటమే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడానికి ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే 9వ రోజున కూడా మొదటి రోజు నాటి ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మాస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది.

జనాల ధర్నా

ఇరుముడి గురించి చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. ఈ సినిమాను జనాలు ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే.. సినిమా కోసం థియేటర్ల దగ్గర ధర్నాలు కూడా చేశారు. అంతలా ఈ ఇరుముడి సినిమా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అందుకే సెకండ్ వీకెండ్ కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More