Irumudi: ఇదీ సక్సెస్ అంటే- ఇరుముడి క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌- సినిమా ఎందుకు తీసేశారంటూ ధ‌ర్నాలు- రవన్నను తొక్కేస్తున్నారా?

Irumudi: థియేటర్లలో సినిమా వేయాలంటూ బయట జనాలు ధర్నా చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు అదే జరుగుతోంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి మూవీని ప్రదర్శించాలంటూ థియేటర్ బయట జనాలు ధర్నా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇరుముడి సినిమాకు ఉన్న క్రేజ్ ను ఇది చాటుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Aug 27, 2026, 06:13:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi: మంచి సినిమాను ఆడియన్స్ ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటారు. మనసారా ఎంకరేజ్ చేస్తారు. ఒక మూవీని జనాలు ఓన్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇరుముడి సినిమాతో స్పష్టమవుతోంది. థియేటర్ల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. టాక్సిక్ రిలీజ్ తో ఇరుముడి మూవీని ఎందుకు తొలగించారని ధర్నాలు చేస్తున్నారు.

ఇదీ సక్సెస్ అంటే- ఇరుముడి క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌- సినిమా ఎందుకు తీసేశారంటూ ధ‌ర్నాలు- రవన్నను తొక్కేస్తున్నారా?
ఇదీ సక్సెస్ అంటే- ఇరుముడి క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌- సినిమా ఎందుకు తీసేశారంటూ ధ‌ర్నాలు- రవన్నను తొక్కేస్తున్నారా?

ఇరుముడి కోసం ధర్నా

ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. థియేటర్లకు ఎగబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శించాలంటూ ఓ థియేటర్ ముందు జనాలు ధర్నా చేయడం విశేషం.

టాక్సిక్ రిలీజ్

ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇంకా టికెట్లు దొరకడం కష్టంగానే మారింది. కానీ బుధవారం (ఆగస్టు 26) రిలీజైన టాక్సిక్ మూవీ కోసం ఇరుముడిని థియేటర్లలో నుంచి తీసేశారు. దీంతో జనాలకు కోపం వచ్చింది. ఇరుముడి చూద్దామని ఆశతో వచ్చిన ఆడియన్స్ థియేటర్లో ఆ మూవీ లేకపోవడంతో కోపంతో ఊగిపోయారు.

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని మక్తల్ లో ఉన్న వెంకటరమణ థియేటర్లో ఇరుముడి సక్సస్ ఫుల్ గా రన్ అయింది. కానీ టాక్సిక్ రావడంతో ఇరుముడిని తీసేశారు. ఇది ఊహించని జనాలు ఇరుముడి సినిమాను ప్రదర్శించాలని థియేటర్ ముందు ధర్నాకు దిగారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎక్స్ ట్రా చైర్ లు

థియేటర్లలో హౌస్ ఫుల్ అయితే ఆడియన్స్ డిమాండ్ మేరకు గతంలో ఎక్స్ ట్రా చైర్ లు వేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ జమానాలో అలా జరగడం అరుదుగా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుముడి సినిమా రూపంలో అలాంటి సీన్లు థియేటర్లలో కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో జనాలు డిమాండ్ చేయడంతో అదనంగా కుర్చీలు వేస్తున్నారు.

రవన్నను తొక్కేస్తున్నారా?

టాక్సిక్ సినిమా రిలీజ్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్న ఇరుముడి మూవీని థియేటర్ల నుంచి తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. కన్నడ డబ్బింగ్ మూవీ కోసం తెలుగు ఒరిజినల్ మూవీని ఎందుకు తీసేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. రవన్న (రవితేజ)ను తొక్కేస్తున్నారా? అని ఫైర్ అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ కొడుకు కాదనే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

వరుస ఫ్లాప్ లతో ఉన్న రవితేజకు ఇరుముడి మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ డేస్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 2 లక్షల 43 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ జోరు చూస్తుంటే రవితేజ మూవీ మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More