RaviTeja: చిన్నపిల్లను ‘ముదురు ముం**’అని పిలిచిన రవితేజ- కామన్ సెన్స్ లేదా? మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారా? నెటిజన్లు ఫైర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. కామన్ సెన్స్ లేదా? మీ కూతురిని ఎవరైనా అలాగే అంటే ఊరుకుంటారా? అని నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బేబీ నక్షత్ర గురించి రవితేజ నోరు జారడమే ఇందుకు కారణం. 

Published on: Aug 17, 2026, 09:25:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ravi Teja: టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం (ఆగస్టు 16) రాత్రి జరిగిన 'ఇరుముడి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఒక చిన్నారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. పబ్లిక్ వేదికపై, అదీ ఒక భక్తిరస చిత్ర వేదికపై ఆయన వాడిన భాష పట్ల నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లను ‘ముదురు ముం**’అని పిలిచిన రవితేజ- కామన్ సెన్స్ లేదా? మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారా? నెటిజన్లు ఫైర్
చిన్నపిల్లను ‘ముదురు ముం**’అని పిలిచిన రవితేజ- కామన్ సెన్స్ లేదా? మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారా? నెటిజన్లు ఫైర్

చిన్నారిపై అనుచిత వ్యాఖ్యలు

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా ఓ ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది. సినిమాలో రవితేజ కుమార్తెగా నటించిన బేబీ నక్షత్ర మైక్ తీసుకొని రవితేజను కొన్ని ప్రశ్నలు అడిగింది.

‘‘నాకు ముద్దు పేరు పెట్టాలంటే ఏం పెడతారు’’ అని రవితేజను నక్షత్ర ప్రశ్నిచింది. కాసేపు ఆలోచించిన రవితేజ ‘ముదురు ముం**’ అనేశారు. దీంతో అక్కడున్న వాళ్లు నవ్వారు. దాని అర్థం తనకు తెలియదని నక్షత్ర అడిగితే.. తర్వాత చెప్తానని రవితేజ మళ్లీ నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవితేజపై ఫైర్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీస విచక్షణ, పబ్లిక్ లో ఉన్నామనే ఆలోచన లేకుండా ఒక మైనర్ చిన్నారిని అలా పిలవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరదాకి, హద్దులు దాటి మాట్లాడే అనుచిత సంభాషణలకు మధ్య తేడా ఉందనే విషయాన్ని సదరు నటుడు గుర్తుంచుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ఈ భాష ఏంటి?

"సొంత కూతురిని వేరొకరు బహిరంగంగా ఇలాగే పిలిస్తే రవితేజ ఊరుకుంటారా?" అని సోషల్ మీడియా వేదికగా పలువురు నిలదీస్తున్నారు. 'ఇరుముడి' లాంటి భక్తిభావంతో కూడిన సినిమా వేదికపై ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమాత్రం తగదని అభిప్రాయపడుతున్నారు. చిత్రపరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న ఒక సీనియర్ నటుడు, సమాజంలో బాధ్యతగల తండ్రి స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడం పట్ల అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

స్టార్‌డమ్ ఉన్న నటులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నోటి జారడం వల్ల పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందాలంటే రవితేజ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పడమే సరైన మార్గమని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఇలా పబ్లిక్ గా నోరు జారడం తప్పని విమర్శిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More