Irumudi Title: ఇరుముడి టైటిల్ వెనుక ఉన్న లాజిక్ చెప్పిన డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌- ఆ మూడు ముడుల కథ- తేడా కొట్టకుంటే హ్యాపీ

Irumudi Title: ‘ఇరుముడి’ అంటూ ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ తో థియేటర్లకు రాబోతున్నారు మాస్ మహారాజా రవితేజ. ఈ మూవీకి శివ నిర్వాణ డైరెక్టర్. ఈ టైటిల్ చూసి ఇది భక్తిరస చిత్రమని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే ఈ టైటిల్ ఎందుకు పెట్టామనే విషయాన్ని శివ నిర్వాణ వివరించాడు. ఆయన ఏమన్నాడంటే?

Published on: Aug 13, 2026, 07:52:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi Title: వరుస ఫ్లాప్ లతో కెరీర్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రవితేజకు ఇప్పుడో హిట్ కావాలి. అందుకే రూట్ మార్చిన మాస్ మహారాజా ఫ్యామిలీ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుముడి’తో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ మూవీకి శివ నిర్వాణ డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఇరుముడి టైటిల్ లాజిక్ కు డైరెక్టర్ వెల్లడించారు.

ఇరుముడి టైటిల్ వెనుక ఉన్న లాజిక్ చెప్పిన డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌- ఆ మూడు ముడుల కథ- తేడా కొట్టకుంటే హ్యాపీ (x)
ఇరుముడి టైటిల్ వెనుక ఉన్న లాజిక్ చెప్పిన డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌- ఆ మూడు ముడుల కథ- తేడా కొట్టకుంటే హ్యాపీ (x)

ఇరుముడి ట్రైలర్

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అత్యంత గ్రాండ్ గా బుధవారం (ఆగస్టు 12) ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేదికగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను, రవితేజ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టామంటే?

ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ సినిమా టైటిల్ 'ఇరుముడి' ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ కథలో మూడు ప్రధానమైన ముడులు (Layers) ఉన్నాయని ఆయన తెలిపారు

‘‘ఇరుముడి అంటే ఇద్దరి మధ్య పడిన ముడి లేదంటే రెండు ముడులు. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ఒక ముడి. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఇరుముడి. అలాగే, ఈ సినిమాలో ఉన్న ఓ క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు లేయర్స్ ను కలిపి ఇరుముడి అనే టైటిల్ పెట్టా’’ అని శివ నిర్వాణ చెప్పారు.

భక్తి సినిమా అంటున్నారు

‘‘చాలా మంది ఇది భక్తి సినిమా అని, శబరిమల వెళ్తారని, ఏదో సినిమాకు రీమేక్ అని రకరకాలుగా వచ్చాయి. అప్పుడే సమాధానం చెప్పొచ్చు. కానీ అది రైట్ టైమ్ లో కంటెంట్ తో మాత్రమే చెప్తే బాగుంటుందని ఆగా. ఇప్పుడు ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందనే క్లారిటీ వచ్చిందనుకుంటా’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు.

‘‘తెలుగు సినిమాలో ఇంతవరకు ఏ ఫ్యామిలీ డ్రామాలోనూ చూడని అత్యంత సహజమైన, ‘రా’అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి" అని ఇరుముడి సినిమాపై శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు.

తేడా కొట్టకుంటే

ఒక్క హిట్టు సామి అంటూ రవితేజ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. 2022లో వచ్చిన ధమాకా తర్వాత మళ్లీ రవితేజకు ఇంకో హిట్ దక్కలేదు. వరుసగా సినిమాలు చేసినా ఫెయిల్యూర్స్ మాత్రమే మిగిలాాయి. అందుకే ఆయన ఫ్యాన్స్ ఒక్క హిట్ అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ తో ఇరుముడిపై చాలా ఆశలు పెంచుకున్నారు.

టైటిల్ వెనుక లాజిక్ ఏదైనా సరే కానీ రవితేజ మాత్రం హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన విలక్షణమైన చిత్రం కావడంతో సక్సెస్ పక్కా అని అంటున్నారు.

రిలీజ్ డేట్

‘ఇరుముడి’ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కీలక పాత్ర పోషించింది. ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.

రవితేజ మార్కు మాస్ ఎనర్జీకి తోడు, శివ నిర్వాణ మార్కు ఎమోషన్స్, క్రైమ్ థ్రిల్లర్ అంశాలు తోడవడంతో ఆగస్టు 21న థియేటర్లలో 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More