Irumudi Glimpse: రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్.. మాస్ వదిలేసి అయ్యప్ప మాల వేయడం వెనుక అసలు లెక్క ఇదేనా?

Irumudi Glimpse: మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇరుముడి' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ స్పెషల్ వీడియో వైరల్ గా మారింది. మాస్ వదిలేసి రవితేజ మాల వేయడం వెనుక రీజన్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Jun 3, 2026, 11:46:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi Glimpse: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అంటేనే మనకు మొదటగా గుర్తొచ్చేది హై-వోల్టేజ్ యాక్షన్, ఎనర్జిటిక్ డైలాగ్స్, పంచ్‌లు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఆయన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన, భావోద్వేగభరితమైన సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇరుముడితో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

పాపే ప్రాణం.. మాస్ మహారాజాా ఎమోషనల్ మేకోవర్.. ఇరుముడి గ్లింప్స్ ఔట్ (x/MythriOfficial)
పాపే ప్రాణం.. మాస్ మహారాజాా ఎమోషనల్ మేకోవర్.. ఇరుముడి గ్లింప్స్ ఔట్ (x/MythriOfficial)

ఇరుముడి గ్లింప్స్

వరుస మాస్ రోల్స్ తర్వాత రవితేజ నటిస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ డివోషనల్ ఎంటర్‌టైనర్ గా 'ఇరుముడి' తెరకెక్కుతోంది. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ (జూన్ 3) ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో వీడియో వదిలారు.

వైరల్ గా వీడియో

ఇరుముడి గ్లింప్స్ వీడియో వైరల్ గా మారింది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ సోషల్ మీడియా వేదికగా విడుదలై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.

సరికొత్తగా మాస్ మహారాజా లుక్

సాధారణంగా రవితేజ సినిమా అంటే ఉండే కమర్షియల్ హంగులు ఇరుముడి సినిమాలోనూ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ కథ ప్రధానంగా భక్తి, నమ్మకం, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకు ఆత్మ వంటిదని చిత్ర బృందం స్పష్టం చేసింది.

తాజాగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ లో రవితేజ, అతని కూతురు మధ్య ఎమోషన్ బాగా ఎలివేట్ అయింది. ఇందులో ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ గా రవితేజ నటిస్తున్నాడని అర్థమైంది. మందు మనేయ్ నాన్న అని కూతురు అడగడంతో హీరో అయ్యప్ప మాల వేసుకుంటాడని తెలుస్తోంది.

జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం

ఈ ఇరుముడి చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నిలవనుంది. గ్లింప్స్‌లో వినిపించే సంగీతం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా, ఎంతో హృద్యంగా ఉంది. ఇక ఈ సినిమాలో పాపులర్ అయ్యప్ప భక్తి పాట 'మల్లెపూల పల్లకి' కూడా ఉండబోతుంది.

కుమార్తెగా నక్షత్ర

ఇరుముడి సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర కీలకమైన కుమార్తె పాత్రను పోషిస్తోంది. వీరితో పాటు సీనియర్ నటుడు సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి ప్రముఖ నటీనటులు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటిస్తున్నారు.

మాల వేయడం వెనుక

రవితేజ మూవీ అంటే మాస్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ అవే రొటీన్ సినిమాలు చేయడంతో అతనికి వరుసగా ఫ్లాప్ లే వస్తున్నాయి. 2023లో చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య చేశాడు రవితేజ. దాని తర్వాత వరుసగా రావణసూర, టైగర్ నాగేశ్వర రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ణప్తి మూవీస్ నిరాశ మిగిల్చాయి. ఈ నేపథ్యంలో హిట్ కోసం మాస్ వదిలేసి రవితేజ మాల వేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

People Also Ask (FAQ)

'ఇరుముడి' సినిమా దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉండబోతోంది?

రవితేజ మునుపెన్నడూ లేని విధంగా ఒక చిన్నారికి తండ్రిగా, అయ్యప్ప స్వామి భక్తుడిగా ఎంతో భావోద్వేగభరితమైన ఆధ్యాత్మిక పాత్రలో కనిపిస్తాడు.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఎవరు?

ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More