Irumudi Chiranjeevi: ఇరుముడి టీమ్‌కు మెగా కంగ్రాచ్యులేషన్స్.. రవితేజతో చిరంజీవి, రామ్ చరణ్.. ఆ క్యామియో గురించి!
Irumudi Chiranjeevi: మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో ఇరుముడి టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందించడం వైరల్ గా మారింది. వీళ్ల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Irumudi Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ 'ఇరుముడి'. ఇంతటి ఘన విజయం సాధించిన ఇరుముడి టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. తమ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ ఫొటోలువ వైరల్ అవుతున్నాయి.

ఇరుముడి టీమ్
రవితేజ హీరోగా నటించిన ఇరుముడి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హీరో రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్లు నవీన్ యెర్నేని, రవి శంకర్ ను చిరంజీవి, రామ్ చరణ్ అభినందించారు.
ఆ క్యామియో గురించి
ఇరుముడి మూవీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో రూమర్లపై మాట్లాడుకున్నారని తెలిసింది. ఇరుముడిలోని మల్లెపూల పల్లకి సాంగ్ లో చరణ్ కూడా కనిపిస్తారని మూవీ రిలీజ్ కు ముందు పుకార్లు వచ్చాయి.
వాల్తేరు వీరయ్య బంధం
తెలుగు చిత్రసీమలో చిరంజీవి, రవితేజల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 'అన్నయ్య' నుంచి 'వాల్తేరు వీరయ్య' వరకు వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.
ఆల్ టైమ్ రికార్డు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్, రమేష్ ఇందిర, స్వస్తిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. బేబీ నక్షత్ర, రవితేజ మధ్య సాగే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ థియేటర్లలో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. దీంతో ఈ మూవీ రూ.280 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టింది.
ఇరుముడి ఓటీటీ
ఇరుముడి మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సెప్టెంబర్ 18 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇరుముడి ఓటీటీ రిలీజ్ కానుంది.
ఇరుముడి ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ రిలీజ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశముంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


