Mamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

Mamitha Baiju: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు.. అవి కూడా నెల వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు చిత్రాలు దుమ్ముదులిపాయి. రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ మమితా బైజు హిస్టరీ క్రియేట్ చేసింది. 

Published on: Sep 1, 2026, 13:41:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mamitha Baiju: మలయాళ కుట్టి, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు సాధ్యంకాని అరుదైన బాక్సాఫీస్ రికార్డును నెలకొల్పింది. కేవలం 29 రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లోని వరుస చిత్రాలతో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి హ్యాట్రిక్ విక్టరీలను ఖాతాలో వేసుకుంది.

నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!
నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

మమితా బైజు బాక్సాఫీస్ సునామీ

‘ప్రేమలు’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు విడుదలైన ఆమె మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించాయి.

జన నాయగన్ (Jana Nayagan)

దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ జూలై 23, 2026న విడుదలైంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మమితా బైజు కీలక పాత్ర పోషించింది.

విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons)

సూర్య కథానాయకుడిగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.240 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా అదరగొట్టింది.

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం బెత్తెహేమ్ కుటుంబ యూనిట్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆగస్టు 21, 2026న రిలీజై ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వారం రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకుంది. సినిమాలో హీరోయిన్ గా మమితా బైజు క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది.

అదే కలిసి వచ్చిందా?

వాస్తవానికి దళపతి విజయ్ 'జన నాయగన్' చిత్రం ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ కారణాల వల్ల జూలై 23కి వాయిదా పడింది. ఈ రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్ మమితా బైజుకు అనుకోకుండా ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.

జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు ఉన్న సరిగ్గా 29 రోజుల వ్యవధిలో ఈ మూడు చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. మూడూ రూ.200 కోట్ల మార్క్‌ను దాటడంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఏకైక నటిగా మమితా హిస్టరీ క్రియేట్ చేసింది.

పక్కింటి అమ్మాయి ఇమేజ్

సాయి పల్లవి తర్వాత మలయాళం నుంచి వచ్చి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను అంతలా గెలుచుకున్న నటి మమితా బైజు. ఆమె సహజ నటన, ఎక్స్‌ప్రెషన్స్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకు విపరీతమైన ఆడియన్స్ కనెక్టివిటీని ఇచ్చాయి.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'జన నాయగన్' వంటి భారీ మాస్ యాక్షన్ డ్రామా, 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' వంటి కంటెంట్-ఓరియెంటెడ్ ఫ్యామిలీ సినిమాలను ఎంచుకోవడం ద్వారా ఆమె తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More