Vishwanath and Sons OTT: భార్యాభర్తలు కాదు.. కానీ బిడ్డకు తల్లిదండ్రులు.. ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. అఫీషియల్ డేట్

Vishwanath and Sons OTT: ఓటీటీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Sep 8, 2026, 11:50:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwanath and Sons OTT: కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons). బాక్సాఫీస్ దగ్గర రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

భార్యాభర్తలు కాదు.. కానీ బిడ్డకు తల్లిదండ్రులు.. ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. అఫీషియల్ డేట్ (x/SitharaEnts)
భార్యాభర్తలు కాదు.. కానీ బిడ్డకు తల్లిదండ్రులు.. ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. అఫీషియల్ డేట్ (x/SitharaEnts)

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ ఎంట్రీ

తమిళ, తెలుగు చిత్రసీమల్లో భారీ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ ఫ్యామిలీ డ్రామా సెప్టెంబర్ 11న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

రూ.260 కోట్లు

దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

స్టోరీ ఏంటంటే?

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో హీరో హీరోయిన్ భార్యాభర్తలు కాదు, కానీ ఓ బిడ్డకు పేరెంట్స్ గా మాత్రం మారతారు. సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ షూటర్ కూడా. కానీ పెళ్లిపై మాత్రం నమ్మకం ఉండదు. తల్లి బలవంతం చేయడంతో సరోగసీ పద్ధతి ద్వారా అభయ్ అనే బిడ్డకు తండ్రి అవుతాడు.

అయితే ఆ చిన్నారి తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. అప్పుడు తల్లి అవసరం ఏర్పడుతుంది. బాబును కాపాడుకోవడానికి సరోగసీ ద్వారా జన్మనిచ్చిన మ్యాడీ అలియాస్ మదనకామేశ్వరి (మమితా బైజు)ని వెతుక్కుంటూ సంజయ్ కుటుంబం ఆమె వద్దకు వెళ్తుంది.

తన బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సంజయ్ ఇంటికి వచ్చిన మ్యాడీ, ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు తెచ్చింది, ప్రేమ, బంధాల పట్ల సంజయ్ కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి నింపింది అనేదే ఈ మూవీ స్టోరీ.

ఐదు భాషల్లో

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఐదు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 11న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More