The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. నాని మాస్ విధ్వంసం.. కానీ సెకండ్ హాఫ్? షాకింగ్ పబ్లిక్ టాక్

The Paradise Twitter Review: భారీ హైప్ తో, మరెన్నో అంచనాలతో ది ప్యారడైజ్ మూవీ ఇవాళ థియేటర్లకు వచ్చేసింది. ఒక రోజు ముందే రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమాకు నెటిజన్ల రియాక్షన్ షాకింగ్ గా ఉంది. నాని మూవీకి ఎక్కువగా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఓ సారి ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ చూసేయండి.

Published on: Sep 24, 2026, 05:55:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise Twitter Review: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ మూవీకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ లో ఎక్కువ మంది నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే ఇందుకు కారణం.

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. నాని మాస్ విధ్వంసం.. కానీ సెకండ్ హాఫ్? షాకింగ్ పబ్లిక్ టాక్ (x/nani)
ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. నాని మాస్ విధ్వంసం.. కానీ సెకండ్ హాఫ్? షాకింగ్ పబ్లిక్ టాక్ (x/nani)

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ

నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 24) రిలీజైంది. అయితే ఒక రోజు ముందు రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఈ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ లో ఎక్కువమంది ది ప్యారడైజ్ మూవీ బాలేదంటూ తమ రివ్యూలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షాకింగ్ ట్విట్టర్ రివ్యూలు ఇచ్చేశారు.

కేసీఆర్, ఎన్టీఆర్ రిఫరెన్స్ లు

ది ప్యారడైజ్ ఫస్ట్ హాఫ్‌లోని జైల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, 'ఆయా షేర్' సాంగ్, సీనియర్ ఎన్టీఆర్-కేసీఆర్ రెఫరెన్సులకు థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే సెకండ్ హాఫ్‌లో సాగదీత, ఎడిటింగ్ లోపాలు, లౌడ్ సౌండ్ మిక్సింగ్ సినిమాను దెబ్బతీశాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్

'ది ప్యారడైజ్' మూవీ ఫస్టాఫ్ ఎంతో ఆసక్తికరంగా, గ్రిప్పింగ్‌గా సాగిందని ప్రీమియర్ షో చూసిన నెటిజన్లు కొనియాడుతున్నారు. ముఖ్యంగా నాని 'షేర్' టైటిల్ కార్డ్ పడిన క్షణం నుంచి 'ఆయా షేర్' సాంగ్, జైల్ ఫైట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి.

మరోవైపు సినిమాలో దివంగత సీనియర్ ఎన్టీఆర్, కేసీఆర్ రెఫరెన్సులు పొందుపరచడం, నాని క్యారెక్టరైజేషన్, అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను ఇచ్చాయని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

దెబ్బకొట్టిన సెకండ్ హాఫ్

మొదటి భాగం ఇచ్చిన హైని సెకండ్ హాఫ్‌లో మేకర్స్ నిలబెట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెకండ్ హాఫ్‌లో మదర్ సెంటిమెంట్, 'నాని తాండవం' సాంగ్ బాగున్నప్పటికీ.. కథనంలో స్పష్టత లోపించడం, ప్రీ-క్లైమాక్స్ సెటప్ బలహీనంగా ఉండటం సినిమా వేగాన్ని తగ్గించాయి.

దానికితోడు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోతాదుకు మించి లౌడ్‌గా ఉండటం, సౌండ్ మిక్సింగ్‌లో లోపాల వల్ల డైలాగ్స్ సరిగ్గా వినపడకపోవడం, అబ్రప్ట్ ఎడిటింగ్ కట్స్ ఆడియన్స్ ఓపికకు పరీక్ష పెట్టాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎమోషనల్ మిస్సింగ్

'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబో నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ది ప్యారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, రస్టిక్ అండ్ రా మాస్ వల్గారిటీని, హెవీ యాక్షన్ మోషన్స్‌ను చూపించాలనే తపనలో శ్రీకాంత్ ఓదెల కథ, కథనాల్లోని ఎమోషనల్ సోల్‌ను మిస్ అయ్యారని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.

కాయదు కోసం

కొంతమంది నెటిజన్లు అయితే కేవలం హీరోయిన్ కాయదు లోహర్ కోసమే సినిమా చూడొచ్చని పోస్టులు పెడుతున్నారు. సినిమాలో ఆమె నెక్ట్స్ లెవల్ లో గ్లామర్ షో చేసిందని అంటున్నారు. చుక్క చిత్రాలు పేరుతో వీడియోలు తీసి డబ్బులు సంపాదించే క్యారెక్టర్ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ది ప్యారడైజ్ ఫ్యూచర్

బాక్సాఫీస్ పరంగా అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ అత్యంత భారీగా నమోదైనప్పటికీ, సెకండ్ హాఫ్‌పై వస్తున్న నెగెటివ్ ఫీడ్‌బ్యాక్, లౌడ్ సౌండ్ డిజైన్ అంశాలు 'లాంగ్ రన్' ని శాసించనున్నాయి. బి అండ్ సీ సెంటర్లలో నాని మాస్ అవతార్, అనిరుధ్ పాటలు మాస్ ఆడియన్స్‌ను ఏమేరకు థియేటర్లకు రాబడతాయి అనేదానిపైనే ఈ సినిమా ఫైనల్ బాక్సాఫీస్ రన్ ఆధారపడి ఉంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More