The Paradise: సర్వర్స్ డౌన్ ఏంటి బ్రో? ది ప్యారడైజ్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో 3 లక్షలకు పైగా టికెట్లు!

The Paradise: నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మూవీ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా అడ్వాన్స్, ప్రీమియర్స్ టికెట్ల కోజం జనాలు ఎగబడుతున్నారు. దీంతో ఏకంగా బుక్ మై షో సర్వర్స్ డౌన్ అయ్యాయి. దీంతో ఈ డిమాండ్ ఏంటి? సర్వర్స్ డౌన్ అవడం ఏంటి బ్రో? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Published on: Sep 23, 2026, 08:32:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise: బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ నాని మాస్ బీభత్సానికి రంగం సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. టికెట్ల కోసం జనాలు పోటెత్తడంతో ఏకంగా బుక్ మై షో సర్వర్లు డౌన్ అయ్యాయని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.

సర్వర్స్ డౌన్ ఏంటి బ్రో? ది ప్యారడైజ్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో 3 లక్షలకు పైగా టికెట్లు! (x/THE PARADISE)
సర్వర్స్ డౌన్ ఏంటి బ్రో? ది ప్యారడైజ్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో 3 లక్షలకు పైగా టికెట్లు! (x/THE PARADISE)

సర్వర్లు డౌన్

ది ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే అంటే ఈ రోజు (సెప్టెంబర్ 23) సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షో, సాధారణ షోలకు డిమాండ్ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఆడియన్స్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ పై దండెత్తారు. దీంతో సర్వర్లు డౌన్ అయ్యాయని నెటిజన్లు చెప్తున్నారు.

3 లక్షలకు పైగా టికెట్లు

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో రచ్చ చేయడానికి ది ప్యారడైజ్ మూవీ సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ రన్‌ను పరిశీలిస్తే, గత 24 గంటల్లోనే బుక్‌మైషో వేదికగా 3,21,000+ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఒక్క రోజు సేల్స్‌లోనే ది ప్యారడైజ్ మూవీ.. నాని కెరీర్‌లో అత్యధిక టికెట్ కన్వర్షన్ రేట్‌ను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచింది.

మోహన్ బాబు, రాఘవ్ జుయల్ క్రేజీ కాస్టింగ్

'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ది ప్యారడైజ్ సినిమాపై హైప్ ఆకాశాన్నంటింది. కలెక్షన్ల సునామీకి తోడు చిత్రంలో నటిస్తున్న క్యాస్టింగ్ కూడా ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సొనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, కాయదు లోహర్ కథానాయికగా అలరించనుంది.

ఎస్ఎల్‌వి సినిమాస్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్‌కి అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బిజిఎమ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

నాని బాక్సాఫీస్ మోత

24 గంటల్లో 3.21 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్‌మైషోలో అమ్ముడవడం అనేది కేవలం నాని వ్యక్తిగత మార్కెట్ రీచ్ మాత్రమే కాకుండా, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ పై ఆడియన్స్ చూపిస్తున్న నమ్మకానికి నిదర్శనం. గతంలో రా అండ్ రస్టిక్ కంటెంట్‌ను ప్రాపర్ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేసిన అనుభవం ఉండటంతో, ఈ కాంబోకు 'మాస్ కార్నేజ్' ఆడియన్స్‌లో గట్టి డిమాండ్ ఏర్పడింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More