Nani: అమ్మకు ఇలాంటి సినిమాలు నచ్చవు.. అయినా రిస్క్ తప్పదు.. నా పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి: నాని

Nani: ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రీసెంట్‌గా నాని తన మూవీ ఛాయిసెస్, వైలెంట్ రోల్స్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. స్క్రీన్‌పై రక్తం, హింస చూడటం అమ్మకు అస్సలు నచ్చదని నాని వెల్లడించారు. 

Published on: Sep 21, 2026, 05:48:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani: 'మాస్' అనిపించుకోవడం లేదా 'స్టార్' టాగ్స్ తగిలించుకోవడం కంటే ఒక పక్కా యాక్టర్ అనిపించుకోవడమే నానికి ఎక్కువ కిక్ ఇస్తుందట. బాక్సాఫీస్ నంబర్లు, కమర్షియల్ లేబుల్స్ ఈ రోజు వస్తాయి.. రేపు పోతాయి. కానీ భవిష్యత్తులో తన పిల్లలకి, అలాగే తెలుగు ఆడియన్స్‌కి "ఇదీ రా నాని సినిమా అంటే!" అని గర్వంగా చూపించుకునేలా తన ఫిల్మోగ్రఫీ ఉండాలనేదే నాని గోల్ అని తెలిసింది.

అమ్మకు ఇలాంటి సినిమాలు నచ్చవు.. అయినా రిస్క్ తప్పదు.. నా పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి: నాని (x/the paradise)
అమ్మకు ఇలాంటి సినిమాలు నచ్చవు.. అయినా రిస్క్ తప్పదు.. నా పిల్లలు గర్వంగా చెప్పుకోవాలి: నాని (x/the paradise)

ది ప్యారడైజ్ మూవీ

నాని హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

స్క్రీన్‌పై అంత రక్తం ఏంటి?

'దసరా' నుంచి నాని తన రూట్ మార్చి పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ వైపు వెళ్తున్నారు. అయితే ఈ ఊరమాస్, హింసాత్మక సీన్లు చేయడం అమ్మకు అస్సలు నచ్చదని నాని సరదాగా చెప్పుకొచ్చారు.

"తెరపై అంత వైలెన్స్, రక్తపాతం చూస్తే మా అమ్మ బాధపడుతుంది. అలాంటి సినిమాలు చెయ్యొద్దు అని చెబుతుంది" అని నాని రీసెంట్‌గా ఓపెన్ అయ్యారు. కానీ ఒక క్యారెక్టర్, దాంట్లోని ఎమోషన్ మనసుకి గట్టిగా తాకినప్పుడు అలాంటి రిస్క్‌లు తీసుకోక తప్పదని నాని స్పష్టం చేశారు. 'ది పారడైజ్' లో వైలెంట్ ఎలిమెంట్స్ ఉన్నా, అది నటుడిగా తన రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని నాని నమ్ముతున్నారు.

పిల్లలు గర్వపడేలా

అంతేకాకుండా, ఇండస్ట్రీలో లభించే స్టార్ టాగ్స్, బాక్సాఫీస్ లేబుల్స్ వెనుక పరిగెత్తే ఉద్దేశం తనకు లేదని నాని కుండబద్దలు కొట్టారు. "ఈ రోజు బాక్సాఫీస్ నంబర్లు వస్తాయి, పోతాయి. కానీ భవిష్యత్తులో నా పిల్లలకి, రాబోయే తరాల తెలుగు ప్రేక్షకులకు గర్వంగా చూపించుకునేలా నా ఫిల్మోగ్రఫీ ఉండాలనేదే నా ఏకైక కోరిక" అని నాని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ ఓదెల విజన్, 'ది ప్యారడైజ్' కథాంశం తన సినిమాటిక్ ఐడెంటిటీని తదుపరి స్థాయికి తీసుకెళ్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు

నాని స్ట్రాటజీ

'బాయ్ నెక్స్ట్ డోర్' ఇమేజ్ నుంచి బయటపడి పాన్-ఇండియా రేంజ్‌లో తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్ సెట్ చేసుకోవడంలో నాని స్ట్రాటజీ చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. సాధారణంగా సేఫ్ జోన్ కంటెంట్, రోటీన్ రోమ్‌కామ్‌లు చేసుకుంటూ పోతే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగానే ఉంటారు. కానీ, రస్టిక్ అండ్ ఇంటెన్స్ యాక్షన్‌తోనే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ సాధ్యమవుతుందని నాని ముందే క్యాచ్ చేశారని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More